https://oktelugu.com/

Corona: మళ్లీ కరోనా కల్లోలం మొదలైందా?

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఇంకా ఈ ప్రపంచాన్ని వీడడం లేదు. మొదటి, రెండో వేవ్ అంటూ భారత్ లో వినాశనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగానూ అన్ని దేశాల్లోని కొంత జనాభాను నామరూపాల్లేకుండా చేసింది. సెకండ్ వేవ్ తో భారతదేశంలో మృత్యుఘోష వినిపించింది. లక్షల మంది చనిపోయారు. సామూహిక దహనాలు చేసిన దుస్థితి. శ్మశానాల ముందు శవాల క్యూలు కనిపించిన భీతావాహ దృశ్యం. అలాంటి రోజులు మళ్లీ రాబోతున్నాయా? అంటే ఔననే సంకేతాలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా […]

Written By:
  • NARESH
  • , Updated On : August 13, 2021 9:14 pm
    Follow us on

    చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఇంకా ఈ ప్రపంచాన్ని వీడడం లేదు. మొదటి, రెండో వేవ్ అంటూ భారత్ లో వినాశనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగానూ అన్ని దేశాల్లోని కొంత జనాభాను నామరూపాల్లేకుండా చేసింది. సెకండ్ వేవ్ తో భారతదేశంలో మృత్యుఘోష వినిపించింది. లక్షల మంది చనిపోయారు. సామూహిక దహనాలు చేసిన దుస్థితి. శ్మశానాల ముందు శవాల క్యూలు కనిపించిన భీతావాహ దృశ్యం. అలాంటి రోజులు మళ్లీ రాబోతున్నాయా? అంటే ఔననే సంకేతాలు వినిపిస్తున్నాయి.

    తాజాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. వ్యాక్సినేషన్ ను ప్రపంచదేశాలన్నీ వేగంగా చేస్తున్నా సరే.. గడిచిన 24 గంటల్లో అన్ని దేశాల్లో కలిపి దాదాపు 10వేల మంది ఈ ఒక్కరోజులో చనిపోవడం విషాదాన్ని నింపింది. 7 లక్షల మందికి ఈ మహమ్మారి సోకింది.

    అమెరికా, బ్రిటన్, ఇరాన్ సహా పలు దేశాల్లో ఈ వైరస్ ఉధృతి ఆందోళనకంగా మారుతోంది.ఒక్క అమెరికాలోనే గడిచిన 24 గంటల్లో ఏకంగా 1.16 లక్షల కేసులు ..614 మరణాలు సంభవించడం కలకలం రేపుతోంది. దాదాపు సగం మందికి ఇప్పటికే అమెరికాలో వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. 70శాతానికి పైగా ఒక డోసు వేసుకున్నారు.అయినా కూడా ఇన్ని కేసులు పెరగడం కలకలం రేపుతోంది.

    ఇక బ్రిటన్ దేశంలోనూ దాదాపు 33 వేల కేసులు నమోదు కావడం పరిస్థితులు చేయిదాటిపోయేలా కనిపిస్తున్నాయి. జులై 23 తర్వాత అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇరాన్ లో ఒక్కరోజులో 39వేల కేసులు నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ కారణంగానే బ్రిటన్ దేశంలో కేసులు పెరుగుతున్నట్టు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. బ్రిటన్ దేశ జనాభాలో 60శాతం మందికి వ్యాక్సిన్ వేసినా కూడా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

    చూస్తుంటే కరోనా థర్డ్ వేవ్ వచ్చేలానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డెల్టా వేరియంట్ కారణంగానే ఆయా దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీన్ని కట్టడి చేయకపోతే ఖచ్చితంగా మూడో వేవ్ విరుచుకుపడి మరో ఉపద్రవం రావడం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.