Mahesh Babu Emotional Note: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) పైకి చాలా సరదాగా కనిపిస్తాడు కానీ, వ్యక్తిగతంగా మాత్రం చాలా ఎమోషనల్. ముఖ్యంగా తన భార్య, పిల్లల విషయంలో చాలా ఎమోషనల్ గా ఉంటాడు మహేష్ బాబు. నేడు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్(Namrata Shirdokar) కి 54వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో నమ్రత శిరోద్కర్ ని ట్యాగ్ చేస్తూ మహేష్ బాబు వేసిన ఒక పోస్ట్ చాల ఎమోషనల్ గా అనిపించింది. ఆయన మాట్లాడుతూ ‘హ్యాపీ బర్త్ డే NSG (నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని). ఇన్నేళ్ల మన దాంపత్య జీవితం లో ప్రతీ విషయం లోనూ నాపై వెలకట్టలేని ప్రేమ చూపిస్తూ, ప్రతీ సందర్భం లోనూ ఎంతో ఓపికగా నాకు తోడుగా ఉన్నావు. జీవితాంతం ఇలాగే ఉండాలి, అంతకంటే నేను నీ నుండి ఎక్కువ ఏమి కోరుకోలేను’ అంటూ చెప్పుకొచ్చాడు.
వీళ్లిద్దరి వివాహం అప్పట్లో ఒక సెన్సేషన్. 2005 వ సంవత్సరం లో మీడియా కి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, సినీ ఇండస్ట్రీ కి చెందిన వారిని ఒక్కరిని కూడా పిలవకుండా, కేవలం కుటుంబ సభ్యుల సమక్ష్యంలో మహేష్ బాబు నమ్రత ని వివాహం చేసుకున్నాడు. వంశీ మూవీ సమయం లో వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారి, డేటింగ్ చేసుకుంటూ వచ్చేలా చేసింది. ఆ తర్వాత చిన్నగా మహేష్ బాబు ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఈ వివాహం చేసుకున్నాడు. మహేష్ కంటే వయస్సులో నమ్రత నాలుగేళ్లు పెద్ద. అయినప్పటికీ కూడా వీళ్ళ పెళ్ళికి పెద్దలు ఎలాంటి అడ్డు చెప్పలేదు. నమ్రత శిరోద్కర్ బాలీవుడ్ లో అప్పట్లో స్టార్ హీరోయిన్. అక్కడ ఆమె ఆరోజుల్లో దాదాపుగా అందరి హీరోలతో కలిసి నటించింది. తెలుగు లో ఆమె ‘వంశీ’ చిత్రం తో మన ఆడియన్స్ కి పరిచయం అయ్యింది.
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘అంజి’ లో హీరోయిన్ గా నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బాలు’ లో కూడా ఆమెకు ఒక హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చింది కానీ, ఎందుకో చివరి నిమిషం లో అది సెట్ అవ్వలేదు. ఇక పెళ్లి తర్వాత మహేష్ కి ఆమె ఇచ్చిన మాట ప్రకారం సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆమె సినీ కెరీర్ ని కొనసాగిచి ఉండుంటే, కచ్చితంగా ఎంతో పెద్ద రేంజ్ కి వెళ్ళేది. అలాంటి కెరీర్ ని కూడా ఆమె కుటుంబం కోసం త్యాగం చేసింది. గౌతమ్, సితార బాధ్యతలు, ఇంటి బాధ్యతలు చూసుకోవడమే కాదు, మహేష్ బాబు వ్యాపారాలను కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది నమ్రత శిరోద్కర్.
View this post on Instagram