Mahesh Babu Dookudu: సినిమా కూడా జీవితంల లాంటిదే. చిత్ర విచిత్రాలు జరుగుతాయి. కొన్ని సార్లు మనం సరే అన్న సినిమాయే బోల్లా కొట్టడం ఇంకొన్ని సార్లు మనం బంపర్ హిట్ అన్న సినిమా బాక్సాఫీసు దగ్గర బోల్తా పడటం చూస్తుంటాం. ఇదే కోవలో ప్రముఖ నటుడు మహేశ్ బాబు జీవితంలో కూడా ఓ సంఘటన చోటుచేసుకుంది. అది కూడా దూకుడు విషయంలోనే కావడం గమనార్హం.

సెన్సెషనల్ డైరెక్టర్ శ్రీను వైట్ల సృష్టించిన చిత్రమే దూకుడు. మహేశ్ లోని నటనకు జీవం పోసింది. అంతే కాదు ఆయన జీవితంలోనే మైలురాయిగా నిలిచింది. అన్ని రికార్డులను తిరగరాసింది. తెలుగు సినిమాలో ఓ ముద్ర వేసింది. అయితే ఈ కథనం వెనుక ఉన్న ఓ ఆసక్తికర విషయం దాగి ఉంది. మొదట గోపిమోహన్ రాసుకున్న కథకు ఓకే చెప్పినా తరువాత ఎందుకో దాన్ని వాయిదా వేశారు.
అప్పటికే అతిథి సినిమాతో ప్లాఫ్ మూటగట్టుకున్న మహేశ్ కు ఏమి అర్థం కాలేదు. ఒక్కడుతో లేచినా అతిథితో మళ్లీ వెనకకే వెళ్లాడు. అయినా నిరాశ చెందలేదు. తరువాత మూడేళ్ల గ్యాప్ తీసుకున్న అనంతరం దూకుడు కథ చేశారు. కానీ శ్రీను వైట్ల మీద నమ్మకంతో మహేశ్ బాబు నటించడంతో ఆయన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఓ మంచి బ్లాక్ బ్లస్టర్ హిట్ ఇచ్చి మళ్లీ మహేశ్ ఆశలు చిగురింపచేశాడు.
ఇంతకీ దూకుడులో తన తండ్రి ఆశయ సాధనకే హీరో శ్రమిస్తుంటాడు. ఆ రాజకీయ నేత మరెవరో కాదు దివంగత మంత్రి పి జనార్థన్ రెడ్డి జీవితంలోని కొన్ని విశేషాలను కథగా రాసుకుని దాని ఆధారంగా దూకుడు కథ అల్లుకున్నారట. దీంతో అది కాస్త విజయవంతమై మహేశ్ బాబుకు ఎనలేని ఖ్యాతి తెచ్చిపెట్టింది. దీంతో దూకుడు కథ చూసిన వారందరికి అనుమానం వచ్చింది. ఈ నేత ఎవరు? ఎవరి పేరు మీద సినిమా తీశారనే చర్చ అప్పట్లో వచ్చింది.

Recommended Videos:


