Mahesh Babu : మన టాలీవుడ్ లో హీరోలను అభిమానులు సొంత కుటుంబ సభ్యులు లాగా భావిస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దమైపోతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది హీరోలను అయితే అభిమానులు దైవ సమానంగా భావిస్తూ ఉంటారు. అలాంటి అభిమానం దక్కడం నిజంగా అదృష్టమే. అలాంటి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న అతి తక్కువ మంది సూపర్ స్టార్స్ లో ఒకరు మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ నుండి వారసత్వంగా మహేష్ కి వచ్చిన ఈ ఫ్యాన్ బేస్ మామూలుది కాదు. తమ అభిమాన హీరో కోసం ఏదైనా చేసేస్తారు. రీసెంట్ గా కర్నూలు లో ఒక మహేష్ బాబు అభిమాని తన పెళ్లి శుభలేఖ పై మహేష్ బాబు(Superstar Mahesh Babu) ఫోటోని ముద్రించాడు. దానికి సంబంధించిన ఫోటో ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది.
Also Read : బాలీవుడ్ హీరోలను కాదని రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేయడానికి కారణం ఏంటంటే..?
జీవితంలో అతి ముఖ్యమైన సందర్భాలలో ఒకటైన పెళ్లి అనే వేడుకలో అభిమాన హీరో ఫోటో వేసుకోవడం గతంలో కూడా అనేకమంది హీరోల విషయంలో జరిగింది. ఇప్పుడు ఆ జాబితాలోకి మహేష్ బాబు కూడా చేరిపోయాడు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి(SS Rajamouli) తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకొని ఒడిశా లో వారం రోజుల షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకున్నారు. మే మొదటి వారం నుండి రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో సుమారుగా నెల రోజుల పాటు ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు. మూడు వేల మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్న ఈ పోరాట సన్నివేశం లో మహేష్ బాబు తో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక, మూవీ టీం ఫారిన్ కి వెళ్లనుంది.
ఆఫ్రికా అడవుల్లో చిత్రీకరణ ఎక్కువ శాతం జరగనుంది. ఈ నేపథ్యం లో రాజమౌళి నిన్ననే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ లో తన అంతర్జాతీయ లైసెన్స్ ని రెన్యువల్ చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో విడుదలై బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రం లోనే ఫారెస్ట్ అడ్వెంచర్ సన్నివేశాలను ఇప్పటి వరకు ప్రపంచం లో ఎవ్వరూ చూపించని విధంగా రాజమౌళి చూపించబోతున్నాడట. ఈ చిత్రం లో డైనోసార్స్ తో మహేష్ బాబు చేసే పోరాటం కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని అంటున్నారు. మన ఊహలకు అందని విధంగా సినిమాలను రూపొందించడంలో రాజమౌళి దిట్ట. ఈ చిత్రాన్ని కూడా అదే రేంజ్ లో తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే రాజమౌళి అధికారికంగా మీడియా తో తెలియజేయబోతున్నాడు.
Also Read : నమ్రత సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్ లను మాత్రమే మహేష్ బాబు ఫైనల్ చేస్తాడా..?