Mahesh Babu : డైరెక్టర్ రాజమౌళి తో సినిమా అంటే ఇండస్ట్రీ లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఆయన సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. మీడియం రేంజ్ హీరోలతో రాజకమౌళి సినిమా చేస్తే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వుధి. అలాంటి మహేష్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేస్తే అంచనాలు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యావరేజ్ సినిమాలతోనే వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాలను అవలీల గా కొట్టే సత్తా ఉన్న మహేష్ బాబు, ఇక రాజమౌళి తో సినిమా అంటే పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. #RRR చిత్రంతో పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్లిన రాజమౌళి, మహేష్ తో చేయబోయే సినిమాతో హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాలతో పోటీ పడబోతున్నాడు.. అందుకు తగ్గట్టుగానే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు రాజమౌళి.
కేవలం ఆయన వర్క్ షాప్ కోసమే మూడు నెలల సమయం తీసుకుంటున్నాడంటే ఈ చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. అందుకే రాజమౌళి కోసం మూడేళ్ళ డేట్స్ ని రాసిచ్చేసాడు మహేష్ బాబు. రాజమౌళి తో సినిమా అంటే జైలులో మూడేళ్ళ పాటు బంధించినట్టే. ఈ జైలు పీరియడ్ లో హీరోలు వేరే సినిమాలు చేయకూడదు, కనీసం కమర్షియల్ యాడ్స్ కూడా చేయకూడదు. మూడేళ్ళ పాటు విరామం లేకుండా డేట్స్ ఇవ్వాలి, మధ్యలో ఫ్యామిలీ టూర్స్ వేయడానికి కూడా లేదట. ఖాళీ సమయం దొరికితే మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశాలకు చెక్కేస్తూ ఉంటాడు. కానీ ఈసారి అలా వెళ్లేందుకు వీలు లేదట, ఏమైనా టూర్స్ కి వెళ్లాలని అనుకుంటే ఈ సమయంలోనే వెళ్ళమని, సినిమా ప్రారంభం అయ్యాక వెళ్ళడానికి వీలు లేదని, కనీసం లుక్ కూడా బయట పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మహేష్ బాబు చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ పెడుతున్నాడట. ప్రస్తుతం మన అందరికీ కనిపిస్తున్న మహేష్ బాబు లుక్స్ ఇంకా పూర్తి స్థాయిలో షేప్ అవ్వలేదు.
పూర్తి స్థాయి లుక్ ని చూస్తే అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. అంతే కాదు ఇందులో మహేష్ బాబు సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించబోతున్నాడని టాక్. ఇప్పటి వరకు తన కెరీర్ లో ఒక్కసారి కూడా తన బాడీ ని చూపించడానికి ఇష్టపడని మహేష్, ఈ సినిమాతో అన్ని గీతలు దాటేస్తున్నాడు. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ నుండి మొదలు కానున్న ఈ సినిమా 2026 చివరి వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తన ప్రతి సినిమా ప్రారంభానికి ముందుకు స్టోరీ ని ప్రెస్ మీట్ ద్వారా వివరించే రాజమౌళి ఈ సినిమాకి కూడా అదే చేయబోతున్నాడు. ఈ నెల చివరి వారంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలను మొదలు పెట్టుకోనుంది.