Rajinikanth – Balakrishna : సౌత్ ఇండియన్ చలన చిత్ర పరిశ్రమలో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కి పర్యాయ పదాలు లాగా అనిపించే హీరోలు సూపర్ స్టార్ రజినీకాంత్, నందమూరి బాలకృష్ణ. వీళ్లిద్దరి అభిమానులు తమ అభిమాన హీరోల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అయిపోతారు. అలాంటి ఫాలోయింగ్ ఉంది. ఆరు పదుల వయస్సు దాటినా కూడా ఇప్పటికీ నేటి తరం స్టార్ హీరోలతో సమానంగా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పెట్టడం సాధారణమైన విషయం కాదు. బాలకృష్ణ కి అఖండ చిత్రానికి ముందు వచ్చిన ఫ్లాప్ సినిమాలు వేరే హీరోకి పడుతుంటే రిటైర్ అయిపోయేవారు. బాలయ్య కాబట్టే మళ్ళీ భారీ కం బ్యాక్ ఇచ్చి మార్కెట్ ని సంపాదించుకున్నాడు. రజినీకాంత్ పరిస్థితి కూడా అంతే. జైలర్ చిత్రానికి ముందు ఆయనకీ వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చేవి. రజినీకాంత్ పని ఇక అయిపోయింది అని ట్రేడ్ అనుకుంటున్న సమయంలో జైలర్ తో 600 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి చరిత్ర సృష్టించాడు.
అలా ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు చాలా పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అప్పట్లో ప్రముఖ డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ రజినీకాంత్ మరియు బాలయ్య కాంబినేషన్ లో ఒక సినిమా చెయ్యాలని అనుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు ‘కథానాయకుడు’. ఇందులో రజినీకాంత్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించగా, జగపతి బాబు హీరో గా నటించాడు. జగపతి బాబు చేయాల్సిన పాత్ర బాలయ్య తో ఎలా చేయిస్తారు, అంత సాఫ్ట్ రోల్ బాలయ్య చేస్తే ఇంకా పెద్ద డిజాస్టర్ అయ్యేది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి ఆ ప్రాజెక్ట్ బాలయ్య చేతిలో వెళ్లుంటే ఆయన ఇమేజి కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా గా విడుదల చేసేవారు. అప్పుడు ఫలితం వేరేలా ఉండేది. ఈ సినిమా కథని డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ బాలయ్య కి చెప్పగానే ఆయన ఒప్పుకున్నాడు.
కానీ రజినీకాంత్ బాలయ్య కి ఈ సినిమా చెయ్యొద్దని ఫోన్ కాల్ చేసి చెప్పాడట. కారణం అలాంటి మాస్ ఇమేజి ఉన్న హీరోల కోసం కథలో మార్పులు చేస్తే సినిమాలో ఆత్మ దెబ్బతింటుందని, ఇది నీ ఇమేజ్ కి తగ్గ సినిమా కాదని, మనం భవిష్యత్తులో ఒక పర్ఫెక్ట్ మల్టీస్టార్రర్ చిత్రం చేద్దామని అన్నాడట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రజినీకాంత్, బాలయ్య మొదటి నుండి మంచి స్నేహితులు. ఎన్టీఆర్ జయంతి వేడుకలకు విచ్చేసిన రజినీకాంత్ బాలయ్య ని ఏ స్థాయిలో పొగిడాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో కూలీ అని చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఇలాగె రజినీకాంత్ బాలయ్య తో కలిసి నటిస్తే బాగుంటుందని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.