Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…’రాజకుమారుడు’ సినిమాతో ప్రిన్స్ గా అవతరించిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో కొంతవరకు డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. ఎప్పుడైతే ఒక్కడు సినిమా వచ్చిందో అతనికి మాస్ లో మంచి ఇమేజ్ దక్కింది. ఆ సినిమాతో మహేష్ బాబుగా మరో మెట్టు పైకి దిగాడనే చెప్పాలి…అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ వచ్చాడు. ప్రస్తుతం రాజమౌళితో వారణాసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం పాన్ వరల్డ్ లో మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ మరింత పెరిగిపోతుంది.
నిజానికి ఆయన ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఒక్క సినిమా కూడా చేయలేదు. డైరెక్ట్ గా పాన్ వరల్డ్ కి వెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక మహేష్ బాబు తన కెరియర్లో ఒక్కసారి కూడా రీమేక్ సినిమాలు చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక హీరో చేసిన సినిమాని తను చేయడం తనకు నచ్చదట.
ఎందుకంటే ఎంతసేపు ఆ హీరో నటించిన నటనే తనకు కనిపిస్తుంది కానీ తను ఎలా కొత్తగా చేయాలి అనే విషయంలో ఆయనకి క్లారిటీ దొరకదనే ఉద్దేశ్యంతోనే ఆయన ఎప్పటికప్పుడు రీమేక్ సినిమాలను రిజెక్ట్ చేస్తూ వచ్చాడు… కానీ లైఫ్ లో మొదటిసారి విక్రమ్ వేద అనే సినిమాని తెలుగులో మరో హీరోతో కలిసి రీమేక్ చేయాలనుకున్నాడట.
రామ్ చరణ్ తో కలిసి ఆ సినిమా చేస్తే బాగుంటుందని తను అభిప్రాయపడ్డప్పటికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మెటీరియలైజ్ కాలేదని మహేష్ బాబు సన్నిహితుల నుంచి కొన్ని వార్తలైతే బయటికి వచ్చాయి. ఇక ఏది ఏమైనా కూడా ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ గా అవతరించడం ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలందరికి పోటీని ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
