కన్నతల్లిని పుట్టిన ఊరిని మరవకూడదు అంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబును చూసి పుట్టిన ఊరు కోసం ఏదో ఒకటి చేయాలని ప్రేరణ పొందొచ్చు. చాలామంది తమ ఊరు కోసం ఏదో చేయాలని తహతహలాడుతుంటారు. వారికి ఇదే సరైన సమయం. మహేష్ లా ఈ కరోనా కష్ట కాలంలో పుట్టిన ఊరు ఋణం తీర్చుకోండి.
ఇంతకీ మహేష్ ఏమి చేసాడంటే.. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి జన్మస్థలం, అలాగే తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేసిన బుర్రిపాలెం గ్రామ ప్రజలందరికీ ఉచితంగా మహేష్ వ్యాక్సినేషన్ వేయించారు. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను గత నెల మే 31న చేపట్టి నేటితో ముగించారు. ఈ వ్యాక్సినేషన్ కార్యకమం విజయవంతంగా పూర్తవ్వడంతో…
తాజాగా మహేష్ బాబు సతీమణి నమ్రత తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా అభిమానులకు తెలియజేస్తూ.. ‘మంచి పని చేశాం. వారం రోజులుగా కొనసాగుతున్న మా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో పాల్గొన్న ఆంధ్ర హాస్పిటల్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ నమ్రత తాజా పోస్ట్ ద్వారా తెలియజేసింది. మహేష్ లాగే ప్రతి స్టార్ హీరో తమ సొంత ఊరుకి ఇలా వ్యాక్సినేషన్ చేయిస్తే ఎంత బాగుంటుంది.
మహేష్ గతంలో వేలాది చిన్నారి గుండెలను కాపాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన సొంత ఊరిలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయడం పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ ప్రస్తుతం చేస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా చివరి దశలో ఉంది. జులైలో షూట్ స్టార్ట్ చేసి ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.d