Mahesh Babu Trusted Directors Failures: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…ఈయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా అవతరించాడు. ‘ఒక్కడు’ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన మహేష్ బాబు ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా కొంతమంది దర్శకులను బ్లైండ్ గా నమ్ముతూ వస్తున్నాడు. వాళ్లు మాత్రం అతనికి కొన్ని సందర్భాల్లో సక్సెస్ ను సాధించి పెడితే మరికొన్ని సందర్భాలు మాత్రం ప్లాప్ లను కట్టబెట్టారు. ముఖ్యంగా ఆయన గుణశేఖర్ ను చాలా బాగా నమ్మాడు. దాంతో ఒక్కడు సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చాడు. ఒక్కడు మూవీ సూపర్ సక్సెస్ అవ్వడంతో అర్జున్, సైనికుడు లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసే అవకాశాన్ని కూడా అందించాడు…
కానీ గుణ శేఖర్ మాత్రం ఒక్కడు మూవీని మినహాయిస్తే అర్జున్, సైనికుడు సినిమాతో సక్సెస్ ని కట్టబెట్ట లేకపోయాడు. అందుకే ఇప్పుడు మహేష్ బాబు అతనితో సినిమా చేసే అవకాశమైతే లేదు. ఇక శ్రీకాంత్ అడ్డాల సైతం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మహేష్ బాబు క్రేజ్ ను అమాంతం తారా స్థాయికి తీసుకెళ్లాడు.
కథ కూడా వినకుండా మహేష్ బాబు చేసిన బ్రహ్మోత్సవం సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. ఇక ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లోనే అత్యంత వరస్ట్ సినిమాగా నిలిచింది. మరి ఈ దర్శకుడు సైతం మహేష్ బాబుతో ఇప్పుడు సినిమా చేసే అవకాశమైతే లేదు. ఇక దానికి తోడుగా ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల ఫామ్ ని కోల్పోయి ఒక సక్సెస్ ని సాధించడానికి సైతం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు…
మహేష్ బాబు ఎవరినైనా సరే చాలా బ్లైండ్ గా నమ్మేస్తాడు. కానీ వాళ్ళు సక్సెస్ ని ఇవ్వకపోతే మాత్రం వాళ్ళ వైపు కూడా చూడడు. మరి ఆయన అంతలా నమ్మి అవకాశం ఇచ్చినప్పుడు తనకి భారీ సక్సెస్ ని సాధించి పెట్టాల్సిన బాధ్యత ప్రతి దర్శకుడు మీద ఉంటుంది. వాళ్లు దాన్ని వాడుకుంటే బాగుంటుంది లేకపోతే మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు…