https://oktelugu.com/

Mahesh: త్రివిక్రమ్​- మహేశ్​ కాంబో సరికొత్త అప్​డేట్​.. దుబాయ్​లో సినమాకు శ్రీకారం!

Mahesh: సూపర్​స్టార్ మహేశ్ బాబు కొత్త సంవత్సరంలో భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా పూర్తి చేసి ఏప్రిల్​కు విడదల చేసేందుకు సిద్ధం చేయగా.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటూనే.. తర్వాత సినిమాలకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి కాంబోలో మహేశ్ సినిమా రానుందని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారికంగా కూడా ప్రకటన వెలువడింది. అయితే, ట్విస్ట్ ఇస్టూ.. మహేశ్​, త్రివిక్రమ్​తో పనులు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 28, 2021 / 12:12 PM IST
    Follow us on

    Mahesh: సూపర్​స్టార్ మహేశ్ బాబు కొత్త సంవత్సరంలో భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా పూర్తి చేసి ఏప్రిల్​కు విడదల చేసేందుకు సిద్ధం చేయగా.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటూనే.. తర్వాత సినిమాలకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి కాంబోలో మహేశ్ సినిమా రానుందని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారికంగా కూడా ప్రకటన వెలువడింది. అయితే, ట్విస్ట్ ఇస్టూ.. మహేశ్​, త్రివిక్రమ్​తో పనులు స్టార్ట్ చేసేశాడు. అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత హ్యాట్రిక్​ చిత్రంగా వీరిద్దరి కాంబినేషన్​లో రానుంది సినిమా. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు పెరిగిపోయాయి.

    Mahesh

    తాజాగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి మహేశ్​ ఇంట్రెస్టింగ్ అప్​డేట్​ ప్రకటిస్తూ సోషల్​మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే థమన్​, త్రివిక్రమ్​, నాగవంశీలతో కలిసి దిగిన ఫొటోను షేర్​ చేశారు. వర్క్ అండ్​ ఛిల్. ఈ టీమ్​తో ప్రస్తుతం పనులు అలా సాగిపోతున్నాయి.. అంటూ క్యాఫ్షన్ ఇచ్చారు.

    Also Read: Mahesh Babu: ప్చ్.. ఏమిటి మహేష్ ఇలా అయిపోయాడు ?

    ఈ మీటింగ్ దుబాయ్​లో జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. మరి వీరిద్దరి కాంబోలో వచ్చే సినమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుందో తెలియాల్సి ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ దర్శకుడిగా మహేశ్28 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

    Also Read: Nizam: నైజాంలో ‘ఆర్ఆర్ఆర్’ దండయాత్ర..!