అలాగే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి త్రివిక్రమ్ సన్నద్ధం అవుతున్నాడు అని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేశారు. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ పేరును ఎప్పుడు ప్రకటిస్తారు ? అంటూ అభిమానులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు ఫలితం దక్కింది. ఇక త్రివిక్రమ్ ఈ సినిమాని చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడట.
పైగా మహేష్ – త్రివిక్రమ్ కలయిక అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టు పదకొండు సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. పైగా ఈ సినిమాని ‘పాన్ ఇండియా సినిమా’గా తీసుకురాబోతున్నారు. అన్నిటికీ మించి త్రివిక్రమ్ ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు, అటు మహేష్ కూడా వరుసగా సక్సెస్ లు అందుకున్నాడు.
అందుకే, ఈ సినిమాకి ఇండియా వైడ్ గా మార్కెట్ అయ్యే అవకాశం ఉంది. ఇక గతంలో వీరి కలయికలో వచ్చిన అతడు బుల్లితెర పై సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఆ తర్వాత చేసిన ‘ఖలేజా’ కూడా బుల్లితెర పై రికార్డ్ స్థాయిలో ఆడింది. అందుకే ఓటీటీ సంస్థలు వీరి కలయికలో రానున్న ఈ సినిమా కోసం పోటీ పడుతున్నాయి.
నిజానికి మహేష్ లోని నటుడిని కొత్తగా ఆవిష్కరించిన మొదటి దర్శకుడు కూడా త్రివిక్రమే. ఇప్పుడు చేయబోయే సినిమాను కూడా మహేష్ కెరీర్ లోనే అత్యున్నతమైన సినిమాగా తీర్చిదిద్దుతాడట. అన్నట్టు హారికా హాసిని క్రియేషన్స్ నిర్మణంలో రానున్న ఈ సినిమాను 2022లో సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.