Mahesh Babu : సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలు మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తారు. ప్రస్తుతం పాన్ ఇండియా ఇండస్ట్రీ లో వాళ్లకంటూ ఒక మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు…ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరో అయితే ప్రస్తుతం రాజమౌళి తో సినిమా చేస్తున్నాడు…ఈ సినిమా తో పాన్ వరల్డ్ లో భారీ విజయాన్ని అందుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహేష్ బాబు సినిమా నుంచి వీడియో లీకైందిగా…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఆయన చేసిన రాజకుమారుడు (Rajakumarudu) సినిమా నుంచి ఇప్పటివరకు ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు దూసుకెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక కెరియర్ స్టార్టింగ్ లోనే ఒక్కడు సినిమాతో భారీ రికార్డులను క్రియేట్ చేసి ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో ప్రేక్షకుల మనసులను దోచుకుంటూ వస్తున్నాడు. తనలాంటి హీరో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం… ఎలాంటి ఎమోషన్ అయిన సరే పరిపూర్ణంగా నటించి మెప్పించగలిగే కెపాసిటి ఉన్నటువంటి నటుడు కూడా తనే కావడం విశేషం…ఇక ఇప్పుడు ఆయన రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కోసం కష్టపడుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఒక్కడు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న మహేష్ బాబు ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన ఎమ్మెస్ రాజు (MS Raju) తో మరొక సినిమా అయితే చేయలేదు. ఒక్కడు (Okkadu) తర్వాత మరికొన్ని సినిమాలను చేసి భారీ విజయాలను సాధించిన ఎమ్మెస్ రాజు ఆ తర్వాత మాత్రం వరుస ఫెయిల్యూర్స్ ని అందుకొని ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఒకప్పుడు భారీ విజయాలను సాధించి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న ఎమ్మెస్ రాజు ఇప్పుడు సినిమాలు లేకుండా పోవడం అనేది అతని అభిమానులను చాలా వరకు బాధపెడుతుందనే చెప్పాలి. అతని స్టోరీ సెలక్షన్ బాగుంటుంది తను ఒక సినిమా స్టోరీని సెలెక్ట్ చేసుకొని సినిమా చేస్తున్నాడు అంటే అది పక్క సక్సెస్ ని సాధిస్తుందనే నమ్మకాన్ని అయితే సంపాదించుకున్నాడు.కానీ ఆ నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకోలేకపోయాడు.
కారణం ఏదైనా కూడా ఆయన ఇండస్ట్రీలో సినిమాలు చేయకుండా ఉండడం అనేది చాలామంది తన అభిమానులను బాధపెడుతోంది. ముఖ్యంగా సినిమా అంటే చాలా ఇష్టపడే ప్రొడ్యూసర్ ఆయన కానీ తను చేసిన సినిమాలేమీ పెద్దగా ఆడకపోవడంతో ఆయనకి ఏ స్టార్ హీరో కూడా డేట్స్ ఇవ్వడం లేదు…ఇక తన కొడుకు సుమంత్ అశ్విన్ ను హీరోగా పెట్టి కొన్ని సినిమాలు చేశాడు. అవి కూడా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు…అందుకే ఆయన ప్రొడ్యూసర్ గా ఇక సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : ఆ విషయం లో మహేష్ బాబు ను టచ్ చేసే హీరో మరొక్కరు లేరా..?