Rajamouli Mahesh Babu Movie: యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఎవరికి వారు స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు పాన్ ఇండియా హీరోలుగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. కానీ మొదట మన ఇండస్ట్రీకి పాన్ ఇండియా గుర్తింపుని తీసుకొచ్చిన దర్శకుడు మాత్రం రాజమౌళి గారనే చెప్పాలి…ఆయన చేసిన బాహుబలి(Bahubali) సినిమాతోనే మన ఇండస్ట్రీ టాప్ లెవల్ కి వెళ్ళింది…
Also Read: హ్యాండ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, ప్రభాస్..ఈ సమ్మర్ కి స్టార్ హీరోల సినిమాలు లేనట్టేనా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)…ఈయన తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకునే ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి అంచనాలైతే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు(Mahesh Babu) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న రాజమౌళి సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను కూడా రీసెంట్ గా మొదలుపెట్టారు. మరి అందులో భాగంగానే ఆదివారం ఒరిస్సాలోని కోరాపుట్ లో జరిగిన షూటింగ్ విజువల్స్ కొన్ని లీక్ అయ్యాయి… #SSMB 29 పేరుతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆ వీడియో చాలా వైరల్ గా మారింది. ఇలాంటి సందర్భంలోనే సినిమా యూనిట్ నుంచి సైబర్ క్రైమ్ వాళ్ళకి కొన్ని కంప్లైంట్స్ రావడంతో ప్రస్తుతం ఆ వీడియోని తొలగించే ప్రయత్నమైతే చేస్తున్నారు.
ఇక దానికి తగ్గట్టుగానే ఆ వీడియోని ఎవరైతే పెట్టారో వాళ్లపైన చట్టపరమైన చర్యలను కూడా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో సినిమా యూనిట్ వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా నుంచి విడుదలైన వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ కొన్ని అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇక ఈ వీడియోలో పృధ్విరాజ్ సుకుమారన్ కుర్చీ మీద కూర్చోగా మహేష్ బాబు రౌడీలా మధ్యలో నిలబడి ఉన్నాడు.
ఇక పృధ్వీరాజ్ సుకుమారన్(Prudhvi Raj Sukumaran) విలన్ గా నటిస్తున్నాడు కాబట్టి అతనికి ఈయనకి మధ్య ఒక భీకర యుద్ధమైతే జరగబోతుందనే దానికి గుర్తుగా మొదట ఈ సీన్ ని తీసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా బయటకు వెల్లడించకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలో ఇలాంటి లీకులు రావడం పట్ల ఆయన తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే ఆయన చాలా రహస్యంగా మెయింటైన్ చేస్తూ వచ్చిన మహేష్ బాబు లుక్ సైతం గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో లీక్ అయింది. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి ఎలాంటి హింటు ఇవ్వకూడదని అనుకుంటున్నాప్పటికి షూటింగ్ సమయంలో వచ్చే లీకులను మాత్రం తను ఆపలేకపోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది…