Mahesh Babu : సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్లకు ఉన్న ఇమేజ్ తో ప్రేక్షకులందరిని థియేటర్ కి రప్పించగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి వాళ్ళ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళు స్టార్ హీరోలుగా మారడమే కాకుండా ఇండస్ట్రీలో పలు రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటారు… ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతుంటాడు. ఎలాంటి కాంట్రవర్సీ ల్లో ఇరుక్కోడు ఎవరిని ఒక్క మాట కూడా అనడు.
తన సినిమా ఫంక్షన్స్ కి వచ్చి ఆ ఫంక్షన్స్ ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు. అయితే మహేష్ బాబు ఇప్పటివరకు చాలా రిజర్వుడ్ గా ఉండేవాడు. కానీ రాజమౌళితో సినిమా చేస్తున్న క్రమంలో తన పంథాను మార్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది.
వారణాసి సినిమా గ్లింప్స్ రిలీజ్ ఫంక్షన్ లో మహేష్ బాబు చాలా సింపుల్ గా వస్తానని చెప్పాడట. కానీ రాజమౌళి మాత్రం తన డ్రెస్సింగ్ స్టైల్ నుంచి తను స్టేజ్ మీదకి ఎలా ఎంట్రీ ఇవ్వాలి అనేది మొత్తం ప్లాన్ చేసి పెట్టారు. కాబట్టి రాజమౌళి అడుగుజాడల్లోనే మహేష్ బాబు నడిచాడు…1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద హైప్ విపరీతమైన రేంజ్ లో ఉండాలి అనే ఉద్దేశ్యంతోనే రాజమౌళి అలాంటి ఒక స్ట్రాటజీస్ అయితే ప్లే చేస్తూ ఉంటాడు.
మహేష్ బాబు సైతం దాన్ని అనుసరించక తప్పడం లేదు. ఇక మహేష్ బాబు సినిమా రిలీజ్ వరకు ఇంకెన్ని ఈవెంట్స్ లో పాల్గొనాల్సి ఉంటుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో రాజమౌళి నెంబర్ వన్ డైరెక్టర్ గా ఉన్నాడు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ లో కూడా తన సత్తా చూపించాలని చూస్తున్నాడు…
