Mahesh Babu Sister Priyadarshini: సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం టాప్ పొజిషన్‌లో ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. రీసెంట్‌గా ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్‌కు కూడా వెళ్లొచ్చారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఇద్దరు అక్కలు ఉన్నారని అందరికీ తెలిసిందే. కానీ చెల్లెలి గురించి చాలా తక్కువమందికి తెలుసు. ఎందుకంటే ఆమె ఎక్కువగా బయట కనిపించారు. కెమెరా ముందుకు అస్సలు రారు.

పద్మావతి, మంజులా, ప్రియదర్శిని వీరంతా మహేశ్‌కు సోదరీమణులు.. మంజుల గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరంలేదనుకుంట.. ఆమె ‘క్యావ్యాస్ డైరీ’ చిత్రంలో నటించారు. నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఆమె భర్త సంజయ్ స్వరూప్ కూడా మంచి యాక్టర్.. మహేష్ పెద్ద సోదరి పద్మావతి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రియదర్శిని హీరో సుధీర్ బాబును వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానం..
తన అన్న సూపర్ స్టార్.. భర్త మంచి రైజింగ్ స్టార్.. సుధీర్ బాబు ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. మారుతి డైరెక్ట్ చేసిన ‘ప్రేమ్ కథా చిత్రమ్’తో సుధీర్ బాబు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అంతకుముందు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏం మాయ చేశావే’ మూవీలో సమంత అన్నయ్య రోల్ చేశాడు. సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని వీలైనంత వరకు వ్యక్తిగత జీవితాన్నిఇష్టపడతారు. ఆర్భాటాలకు పోరు. చాలా సింపుల్‌గా ఉంటారు. భర్త పిల్లలతో లైఫ్ లీడ్ చేస్తారు. అయితే, మహేష్ బాబు తన అక్కల కంటే చెల్లి ప్రియదర్శినితోనే చాల క్లోజ్‌గా ఉంటారని తెలుస్తోంది.
Also Read: 2021లో పది రోజుల పాటు కోటి రూపాయల షేర్ వసూలు చేసిన సినిమాలివే..
తాజాగా సుధీర్ బాబు తన భార్య ప్రియదర్శిని, కుమారులతో ఫోటో షూట్ నిర్వహించారు.ఇందులో ప్రియదర్శిని స్మైల్ అచ్చం తన అన్న మహేశ్ బాబును గుర్తు చేస్తోందని అభిమానులు అంటున్నారు. ఫస్ట్ టైం ప్రియదర్శిని ఫోటో షూట్‌లో కనిపించడంలో ఫ్యాన్స్ వాటిని నిమిషాల్లోనే వైరల్ చేసేసారు. ఇక మహేశ్ బాబు బావ సుధీర్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరగా ఆయన నటించిన శ్రీదేవి సోడా సెంటర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
Also Read: ‘లైలా’లో మళ్ళీ ఆశలు.. కారణం మహేషే !