Murali Mohan: అది 1973 వ సంవత్సరం.. ఆ రోజుల్లో సినిమా అంటే అదొక అద్భుతం.. ఇక సినిమా వాళ్ళు అంటే వాళ్ళు ప్రత్యేక వ్యక్తులు అని ప్రజలు విశ్వసించేవారు. పైగా ఆ రోజుల్లో సినిమాల్లో అవకాశాలు అంత ఈజీగా వచ్చేవి కావు. ఫొటో ఆల్బమ్ పట్టుకుని ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్లు ఎందరో ఉన్నారు. అందుకే.. తనకు తిరిగినా ఛాన్స్ లు వస్తాయనే నమ్మకం లేక.. మురళీమోహన్ సినిమాల్లో ట్రై చేయలేదు.

కానీ, నటుడు కావాలనే ఆశ మనసులో బలంగా ఉంది. పైగా ఆయనకు కృష్ణ మంచి స్నేహితుడు. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఒకరిపై ఒకరికి అభిమానం ఉంది. కానీ, కృష్ణ సాయంతో నటుడిగా ఎదగడం మురళీమోహన్ కి ఇష్టం లేదు. అయితే, ‘జగమే మాయ’ అనే సినిమా కోసం కొత్త నటీనటులను వెతుకుతున్నారు అని తెలిసి మురళీమోహన్ ఫోటోలు పంపారు.
‘మీరే మా హీరో, వెంటనే మద్రాసు వచ్చేయండి’ అని బదులు ఉత్తరం వచ్చింది. అలా ఆయన మొదటి సినిమాలో నటించారు. మధ్యలో కృష్ణను కలిసినా తన సినిమా గురించి మురళీమోహన్ ఎన్నడూ చెప్పలేదు. అలా కృష్ణకు మురళీమోహన్ హీరోగా నటించాడనే విషయం తెలియదు. మరోపక్క దాసరిగారి దర్శకత్వంలో కృష్ణ ‘రాధమ్మపెళ్లి’ అనే సినిమా చేసున్నారు.
Also Read: ‘వాణిశ్రీ గారు మా రుచి చూస్తారా ?… ఎన్టీఆర్ అలవాట్లు ఆశ్చర్యకరం !
మద్రాసులో షూటింగ్ జరుగుతోంది. అందులో ఓ గెస్ట్ వేషం ఉంది, ఆ వేషానికి మురళీమోహన్ అయితే బాగుంటుందని దాసరి గారు పిలిపించారు. సెట్ కి వచ్చిన మురళీమోహన్ ను చూసి కృష్ణ గారు తన కోసమే వచ్చాడనుకుని పక్కన కూర్చో వస్తున్నా అని సైగ చేశారు. అంతలో దాసరి గారు వచ్చి.. మురళీమోహన్ కి మేకప్ వేయించి షూటింగ్ స్పాట్ లోకి తీసుకొచ్చారు.
స్పాట్ లో తనకు ఎదురుగా మేకప్ తో ఉన్న మురళీమోహన్ ను చూసి ‘హేయ్.. నువ్వేంటి మేకప్ తో వచ్చావ్’ అంటూ కృష్ణ గారు షాక్ అవుతూ అడిగారు. మురళీమోహన్ చిన్న సిగ్గుతో ‘నేను సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను కృష్ణ’ అంటూ అసలు విషయం చెప్పారు. ‘మరి ? నాకు ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదు ? నన్ను ఎందుకు అవకాశం అడగలేదు ?’ అంటూ ఆశ్చర్యపోతూనే దాసరి గారికి మురళీమోహన్ ను తన స్నేహితుడు అని కృష్ణ గారు పరిచయం చేశారు.
Also Read: ‘లైలా’లో మళ్ళీ ఆశలు.. కారణం మహేషే !