Manjula- Balakrishna: ఓ స్టార్ హీరో కొడుకు హీరో అవ్వొచ్చు కానీ కూతురు హీరోయిన్ కాకూడదు. దానికి సదరు హీరోతో పాటు కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకున్నా ఫ్యాన్స్ అసలు ఒప్పుకోరు. హీరోయిన్ అంటే అందరికీ చిన్నచూపు అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. చిత్ర పరిశ్రమలో పుట్టిపెరిగిన వారిగా స్టార్ హీరోల కూతుళ్ళకు కూడా వెండితెరపై వెలిగిపోవాలనే కలలు ఉంటాయి. వాళ్ళ కలలను, ఆశలను ఎవరూ ప్రోత్సహించరు. అదే అబ్బాయి అయితే టీనేజ్ నుండే ప్రిపరేషన్ మొదలుపెడతారు. డాన్సులు, గుర్రపు స్వారీలు, నటన నేర్పిస్తారు. ఓ స్టార్ డైరెక్టర్ తో అట్టహాసంగా లాంచ్ చేస్తారు.

చాలా అరుదుగా హీరోల కూతుర్లు హీరోయిన్స్ గా మారే స్వేచ్ఛ కలిగి ఉంటారు.సౌత్ లో శృతిహాసన్, వరలక్ష్మీ, నిహారిక లాంటి అతికొద్ది మంది ఉన్నారు. కాగా కృష్ణ వారసురాలు ఘట్టమనేని మంజులకు నటనంటే చాలా ఇష్టం. ఆమె హీరోయిన్ కావాలని చాలా ఆశపడ్డారు. ఇదే విషయాన్ని కృష్ణకు చెప్పగానే తిరస్కరించారట. పట్టువదలని మంజుల మీ పేరెంట్స్ కూడా ఇలానే అడ్డుకుంటే మీరు ఇంత పెద్ద స్టార్ అయ్యేవారా? అని ప్రశ్నించడంతో కృష్ణ ఆమె కోరిక అర్థం చేసుకొని అనుమతి ఇచ్చాడట.
Also Read: Sarkaru Vaari Paata Record In OTT: OTT లో కూడా అరుదైన రికార్డు ని సృష్టించిన సర్కారు వారి పాట

ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో బాలకృష్ణ చేస్తున్న టాప్ హీరో(1994) మూవీ హీరోయిన్ గా మంజులను ఓకే చేశారు. ఈ విషయం బయటికి రావడంతో కృష్ణ ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. ఎస్వీ కృషారెడ్డి కట్ ఔట్స్ చించి నిరసన తెలిపారు. దీంతో కృష్ణ, మంజుల వెనక్కి తగ్గారు. అలా హీరోయిన్ కావాలనుకున్న మంజుల ఆశలు ఆవిరయ్యాయి. మంజుల తప్పుకోవడంతో సౌందర్యను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక టాప్ హీరో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఫ్యాన్స్ నా కూతుళ్లను సోదరి భావంతో చూస్తున్నారు. అందుకే వారు అలా వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు కృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
నటనపై మక్కువ చంపుకోని మంజుల ‘షో’ టైటిల్ తో ప్రయోగాత్మక చిత్రం చేశారు. నటుడు సూర్య-మంజుల నటించిన ఈ మూవీ మొత్తం రెండు పాత్రలతో నడుస్తుంది. తర్వాత నిర్మాతగా, దర్శకురాలిగా కొన్ని చిత్రాలు చేశారు. మెగా డాటర్ నిహారిక సైతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. అయితే మెగా ఫ్యాన్స్ ని ఎదిరించి హీరోయిన్ అయ్యారు.కాగా ఆమెకు సక్సెస్ దక్కలేదు. దీంతో పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.
Also Read:Major Unnikrishnan: మేజర్ ఉన్నికృష్ణన్ గురించి రోమాలు నిక్కపొడిచే నిజాలు



[…] […]