టాలీవుడ్ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న మహేష్ బాబు.. పర్ఫెక్ట్ ఫ్యామిలీ మెన్ గానూ మంచి పేరు సంపాదించుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో బెస్ట్ కపుల్ లిస్టు తీస్తే.. మహేష్ బాబు-నమ్రత ముందు వరసలోనే ఉంటారు. కుటుంబానికి ఎంతో ఇపార్టెన్స్ ఇచ్చే ప్రిన్స్.. ఏ మాత్రం అవకాశం చిక్కినా వారితో కలిసి టూర్లు వేస్తూ జాలీ గడుపుతుంటాడు. ఖచ్చితంగా క్వాలిటీ టైమ్ ను ఫ్యామిలీకి కేటాయిస్తాడు. అలాంటి మహేష్.. ఒక్క విషయంలో మాత్రం నమ్రతను కౌంట్ చేయనని, ఆమెను పట్టించుకోనని అంటున్నాడు.
ఏ హీరో స్టార్ డమ్ అయినా.. అంతిమంగా సక్సెస్ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి.. స్టోరీ సెలక్షన్ అనేది అత్యంత కీలకం. ఇంకా చెప్పాలంటే అదే ఫైనల్ కూడా. అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా.. సినిమా మొత్తమే డిజాస్టర్ అయిపోతుంది. హీరో జాబితాలో ఓ ఫ్లాప్ చేరిపోవడంతోపాటు.. స్టార్ గ్రాఫ్ కూడా పడిపోతుంది. అందువల్ల.. స్టోరీ సెలక్షన్స్ లో ప్రతీ హీరో ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఫైనల్ చేస్తారు.
దీనికి మహేష్ బాబు కూడా అతీతం కాదు. ఆయన కూడా అత్యంత జాగ్రత్తగా స్టోరీ సెలక్ట్ చేసుకుంటారు. అంతేకాదు.. ఏ మాత్రం నచ్చకపోయినా నిర్మొహమాటంగా నో చెప్పేస్తారు. అయితే.. టాలీవుడ్ లో చాలా కాలంగా ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు సినిమా స్టోరీ సెలక్షన్ లో నమ్రత పాత్ర కూడా ఉంటుందన్నది దాని సారాంశం.
అంతేకాదు.. నమ్రతకు నచ్చకపోతే.. స్టోరీలో మార్పులు సూచిస్తుందని, దర్శకులు, రచయితలు దాన్ని పాటించాల్సిందేనని ప్రచారం సాగుతోంది. ఒకవేళ అసలు కథ నచ్చకపోతే ఆమె రిజెక్ట్ చేస్తుందని కూడా భోగట్టా. త్రివిక్రమ్ తో తీయాల్సిన సినిమా విషయంలోనూ నమ్రత కీ రోల్ ప్లే చేశారనే టాక్ వచ్చింది. వీటన్నింటిపై మహేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మహేష్ బాబు.. స్టోరీ సెలక్షన్ లో ఫైనల్ డెసిషన్ తనదేనని చెప్పేశాడు. తనకు నచ్చితేనే కథ ఫైనల్ అవుతుందని తేల్చేశాడు. ఈ విషయంలో నమ్రత పాత్ర ఏమీ ఉండదని, అంతా తానే చూసుకుంటానని చెప్పాడు సూపర్ స్టార్. దీంతో.. ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్నదంతా వట్టిదేనని తేలిపోయింది.