Mahesh Babu Rejected Script : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు (Mahesh Babu) కు చాలా మంచి గుర్తింపైతే ఉంది. రాజకుమారుడు (Rajakumarudu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తన కెరియర్ మొదట్లోనే మంచి విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇక ఒక్కడు (Okkadu) సినిమాతో మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్న ఆయన అప్పటినుంచి బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతూ వచ్చాడు. పోకిరి(Pokiri) సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సైతం తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు అప్పటి నుంచి వెని తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : రాజాసాబ్ సినిమాలో ఒక్క సీన్ లో ప్రభాస్ అలా కనిపించబోతున్నాడా..? ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
అయితే మహేష్ బాబు చేయాల్సిన ఒక సూపర్ హిట్ సినిమాని అక్కినేని వారసుడు అయిన సుమంత్ (Sumanth) చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. శేఖర్ కమ్ముల (Shekar Kammula) దర్శకత్వంలో వచ్చిన ‘గోదావరి’ (Godhavari) సినిమా స్టోరీని మొదట మహేష్ బాబు వినిపించారట. మహేష్ బాబు ఈ సినిమాని చేయడానికి విపరీతమైన ఆసక్తి చూపించినప్పటికి అప్పుడు తను ఉన్న బిజీ వల్ల ఆ సినిమాను చేయలేకపోయారట.
మొత్తానికైతే ఆ సినిమాని మహేష్ బాబు చేసుంటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో సూపర్ సక్సెస్ సాధించేది అంటూ మహేష్ బాబు అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మొత్తానికైతే మహేష్ బాబు (Mahesh Babu) మిస్ చేసుకున్న సినిమాని సుమంత్ తన కెరీర్ లోనే ఒక క్లాసికల్ సినిమాగా నిలుపుకున్నాడు. మొత్తానికైతే ఈ సినిమాలో సుమంత్ యాక్టింగ్ చాలా బాగుంటుంది.
సినిమా మొత్తం ఒక ఫ్లేవర్ లో నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని చూడడానికి చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మొత్తానికైతే ఈ సినిమాతో సుమంత్ ఒక డీసెంట్ సక్సెస్ ని సాధించడమే కాకుండా తన ఎంటైర్ కెరియర్ లో ఈ సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…