Nandamuri Mokshagna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు లాంటి నటుడు మరొకరు లేరు అనేది వాస్తవం. ఆయన చేసిన సినిమాలు యావత్ ప్రేక్షకులందరిని మెప్పిస్తూ వస్తున్నాయి… వాళ్ల నాన్న అయిన ‘ తారక రామారావు’ గారి అడుగుజాడల్లోనే నడుస్తూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు… ఇక ఇప్పటికే బాలయ్య రాముడిగా, కృష్ణుడిగా నటించి మెప్పించాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నట వారసుడు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడు అనేదానిమీద గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికి అవి ఇప్పటివరకు కార్యరూపం అయితే దాల్చడం లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే గత సంవత్సరం మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా చేయబోతున్నాడు అంటూ ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. కానీ ప్రశాంత్ వర్మ తను ఇతర సినిమాల బీజీ లో ఉండడం వల్ల మోక్షజ్ఞ సినిమాను పట్టించుకోకపోవడంతో ప్రశాంత్ వర్మ ను పక్కన పెట్టి ఒక పాన్ ఇండియా డైరెక్టర్ తో బాలయ్య మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన కథ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే కల్కి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగ్ అశ్విన్ గా తెలుస్తోంది. మరి ఈ విషయాన్ని మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 6 వ తేదీన అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం ‘కల్కి 2’ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నప్పటికి ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే ఒక సంవత్సరం పాటు ప్రభాస్ స్పిరిట్ సినిమా మీద తన పూర్తి ఫోకస్ ను కేటాయించబోతున్నాడు. కాబట్టి ఈ గ్యాప్ లో మోక్షజ్ఞ సినిమాని చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరిలో నాగ్ అశ్విన్ కూడా చాలా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కాబట్టి బాలయ్య బాబు అతనితోనే తన కొడుకుని లాంచ్ చేయించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతోంది అనేది తెలియాల్సి ఉంది. నిజానికైతే నందమూరి అభిమానుల నుంచి కూడా ఈ విషయం మీద పలు రకాల వార్తలైతే వస్తున్నాయి. మరి మోక్షజ్ఞ బర్త్ డే రోజు ఈ సినిమాను అనౌన్స్ చేసి వచ్చే సంవత్సరం మోక్షజ్ఞ బర్త్ డే లోపు ఆ సినిమాని రిలీజ్ చేయగలుగుతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…