Varanasi Trailer: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా టైటిల్ ఏంటి? అంటూ గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలైతే వచ్చాయి…అందులో భాగంగానే చాలా సైట్ల నుంచి రకరకాల రూమర్స్ వచ్చాయి… కానీ ‘ఓకే తెలుగు’ సైట్ నుంచి వచ్చిన లీక్ మాత్రమే నిజమైంది… గత వారం రోజుల క్రితమే రాజమౌళి – మహేష్ బాబు సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ పెట్టబోతున్నారు అంటూ ఓకే తెలుగు ఒక కథనాన్ని ప్రచురించింది. ఇక ప్రస్తుతం ‘గ్లోబ్ ట్రిట్టర్’ పేరుతో రాజమౌళి నిర్వహిస్తున్న ఈవెంట్లో సినిమా టైటిల్ ‘వారణాసి’ గా ఆఫీసులు అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మొత్తానికైతే ఓకే తెలుగు సైట్ లోని కంటెంట్స్ జనం మెచ్చే విధంగా చాలా జెన్యూన్ గా ఉంటాయని చెప్పడానికి దీనినొక ఉదాహరణ గా తీసుకోవచ్చు. ఇక రాజమౌళి ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ని రీవిల్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో ఆయన ఒక అగ్రెసివ్ పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ‘రుద్ర’ అంటూ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ను పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక రాజమౌళి అనుకున్నట్టుగానే ఈ సినిమాతో పాన్ వరల్డ్ ప్రేక్షకులందరు తెలుగు సినిమా వైపు చూసేలా చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఆర్ ఎఫ్ సి లో నిర్వహించిన ఈ సినిమా ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…