Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu And Jayakrishna: రమేష్ బాబు కొడుకు జయకృష్ణ గురించి మహేష్ బాబు కృష్ణకి...

Mahesh Babu And Jayakrishna: రమేష్ బాబు కొడుకు జయకృష్ణ గురించి మహేష్ బాబు కృష్ణకి మాట ఇచ్చాడా…

Mahesh Babu And Jayakrishna: సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించాడు. ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరో కూడా తనే కావడం విశేషం… ఇక ఇలాంటి క్రమంలోనే తన కొడుకు అయిన రమేష్ బాబు సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆయన అనుకున్న స్థాయిలో సక్సెస్ ని సాధించలేకపోయాడు. ఆయన తర్వాత మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మహేష్ మొదట్లో కొంచెం తడబడ్డప్పటికి ప్రస్తుతం పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. అయితే కృష్ణ చివరి రోజుల్లో మహేష్ బాబు దగ్గర ఒక మాట తీసుకున్నాడట. రమేష్ బాబు కొడుకు అయిన జయకృష్ణను హీరోగా నిలబెట్టే బాధ్యతని నువ్వు తీసుకోవాలని మహేష్ బాబుకి చెప్పాడట. దానికి మహేష్ సైతం అంగీకరించాడట. అందుకే జయకృష్ణ మొదటి సినిమా విషయంలో మహేష్ బాబు ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువగా ఉంటుంది. అజయ్ భూపతి డైరెక్షన్లో అతనితో సినిమా చేయిస్తున్నాడు. జయ కృష్ణ లుక్స్ కూడా హీరో రేంజ్ లోనే ఉన్నాయి. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు మహేష్ బాబు ఒక్కడే టాప్ హీరోగా రాణిస్తున్నాడు.

మరో హీరో అయితే లేడు. కాబట్టి ఇప్పుడు జయకృష్ణ సైతం తన బాబాయ్ అయిన మహేష్ బాబు బాటలో నడవాలని సూపర్ సక్సెస్ లను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే భారీ విజయాలను అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మొత్తానికైతే మహేష్ బాబు కృష్ణకి ఇచ్చిన మాట ప్రకారం జయకృష్ణ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేయిస్తున్నాడు. మరి జయ కృష్ణ కి టాలెంట్ ఉండి అతను మంచి కథలను ఎంచుకొని మంచి సినిమాలను చేస్తూ టాప్ హీరోగా మారతాడా? లేదా అనేది అతని చేతిలోనే ఉంది… మహేష్ బాబు సపోర్ట్ అయితే అతనికి ఎప్పటికి ఉంటుంది.

కాబట్టి స్టోరీల సెలక్షన్లో గాని దర్శకులను ఎంపిక చేసుకోవడంలో మహేష్ బాబు కొంతవరకు అతనికి సలహాలు సూచనలైతే ఇస్తుంటాడు. ఇక మహేష్ బాబు ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ తను టాప్ హీరోగా మారుతాడా? తన తాత సూపర్ స్టార్ కృష్ణ కోరికను నెరవేరుస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular