spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu New Movie: 'వారణాసి' కి ముందే మహేష్ నుండి కొత్త సినిమా.. ఇది...

Mahesh Babu New Movie: ‘వారణాసి’ కి ముందే మహేష్ నుండి కొత్త సినిమా.. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించలేదుగా..

Mahesh Babu New Movie: ‘వారణాసి’ కి ముందే మహేష్ బాబు(Super Star Mahesh Babu) నుండి కొత్త సినిమా రాబోతోందా?, ఇదెలా సాధ్యం, ఇన్ని రోజులు సీక్రెట్ గా కొత్త సినిమా షూటింగ్ చేశారా?, ఎప్పుడు విడుదల అవ్వబోతుంది?, ఇలా హెడ్ లైన్ ని చూసిన తర్వాత మీ అందరికీ ఎన్నో ఆలోచనలు వచ్చి ఉంటాయి. నిజంగానే మహేష్ బాబు నుండి ఒక కొత్త సినిమా రాబోతుంది. కానీ అందులో ఆయన హీరో గా నటించడం లేదు , అతిథి పాత్ర కూడా చేయడం లేదు , కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తున్నాడు. ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా మహేష్ బాబు నిర్మాతగా పలు సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. శ్రీమంతుడు చిత్రం తో ఈ నిర్మాణ సంస్థ మొదలైంది. అప్పట్లో ఎక్కువగా తన సొంత సినిమాలే నిర్మించేవాడు కానీ, ‘మేజర్’ నుండి బయట సినిమాలను కూడా నిర్మించడం మొదలు పెట్టాడు.

అడివి శేష్ హీరో గా నటించిన ‘మేజర్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రమిది. ఈ చిత్రం తర్వాత ఆయన ప్రముఖ యంగ్ హీరో సత్య దేవ్ తో ‘రావు బహదూర్’ అనే చిత్రాన్ని నిమిస్తున్నాడు. శరవేగం గా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు చివరి దశకు చేరింది. ‘C/O కంచరపాలెం’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని , ఆడియన్స్ కి అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని కలిగించిన వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ కారణం చేతనే ఈ చిత్రానికి మార్కెట్ లో కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇకపోతే కాసేపటి క్రితమే మహేష్ బాబు టీం ఈ చిత్రం గురించి ఒక కీలక ప్రకటన చేసింది.

ఈ చిత్రాన్ని జూన్ 5 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయబోతున్నారు అట. గత సంవత్సరం విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎల్లప్పుడూ కొత్తదనం కోరుకునే సత్య నుండి మరో ప్రయోగాత్మక చిత్రం రాబోతుందని, కచ్చితంగా ఈ చిత్రం అంచనాలను అందుకుంటుందని , విజయం సాదిస్తుందని అంతా అనుకున్నారు. మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది చూడాలి. మేజర్ మూవీ విడుదలకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా యాక్టీవ్ గా ప్రొమోషన్స్ లో పాల్గొనేవాడు. మరి ఈ సినిమాకు కూడా ప్రొమోషన్స్ లో పాల్గొంటాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ పాల్గొంటే మాత్రం మహేష్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular