Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu directors comments: మహేష్ బాబు మీద నెగెటివ్ కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్లు...

Mahesh Babu directors comments: మహేష్ బాబు మీద నెగెటివ్ కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్లు…

Mahesh Babu directors comments: ఇండస్ట్రీ లో కొందరు హీరోలకు చాలా మంచి గుర్తింపు ఉంటుంది. వాళ్ళ నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వాళ్లను టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే తెచ్చుకున్నాడు.

మహేష్ బాబును ఒక ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ చాలా వరకు తక్కువ అంచనా వేశారు. మురుగదాస్ లాంటి దర్శకుడు మహేష్ బాబుతో ‘స్పైడర్’ అనే సినిమా చేస్తున్నానని అనౌన్స్ చేసినప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్న మణిరత్నం మహేష్ బాబుతో అలాంటి సినిమాలు చేస్తే వర్కౌట్ అవ్వవు అంటూ కామెంట్లు చేశాడు. మరి మహేష్ బాబు ఇమేజ్ కి అది సరిపోదనే ఉద్దేశ్యంతో అన్నాడా?

లేదంటే ఆయన మహేష్ బాబు తో సినిమా చేయడం వృధా అనే సెన్స్ తో అన్నాడా అనే విషయం మీద సరైన క్లారిటి లేదు కానీ మహేష్ బాబు అభిమానులు మణిరత్నం మీద కొంతవరకు సీరియస్ అయ్యారు. గతంలో మణిరత్నం సైతం మహేష్ బాబుతో ఒకటి రెండు సందర్భాల్లో సినిమాలు చేయాలనే ప్రణాళికలు రూపొందించుకున్నప్పటికి అది కార్యరూపం దాల్చలేదు… ఇక ‘త్రీ ఇడియట్స్’ సినిమాని రీమేక్ చేస్తున్న క్రమంలో మొదట శంకర్ మహేష్ బాబును ఆ సినిమాలో హీరోగా తీసుకోవాలని అనుకున్నాడు.

కానీ మహేష్ బాబు మాత్రం రీమేక్ సినిమాలు తను చేయనని చెప్పడంతో శంకర్ కొంతవరకు అతని మీద కోపంతో ఉన్నారట. దాంతో మహేష్ బాబు కంటే ఈ మూవీకి విజయ్ అయితేనే చాలా బెటర్ గా ఉంటుందని అతన్ని తీసుకున్నాము అంటూ శంకర్ తమిళ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలియజేయడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా మణిరత్నం, శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్లు మహేష్ బాబు స్టామినా ను అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version