Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. కెరియర్ మొదట్లో రాజకుమారుడు, ఒక్కడు, అతడు, పోకిరి లాంటి వరుస సక్సెస్ లతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాలతో సైతం భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు(Mahesh Bab)… ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సైతం క్రియేట్ చేసుకోవడంలో ఆయన కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి. తద్వారా ఆయనకు ఎలాంటి గుర్తింపు రాబోతుంది అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతానికి మహేష్ బాబు రాజమౌళి డెరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాతో మహేష్ బాబు ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకప్పుడు చాక్లెట్ బాయ్ గా కనిపించే మహేష్ బాబు ఆ తర్వాత మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల విపరీతమైన ఆదరణను సంపాదించుకున్నాడు.
Also Read : బాలీవుడ్ హీరోలను కాదని రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేయడానికి కారణం ఏంటంటే..?
పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని దక్కించుకున్న ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు మరొక ఇండస్ట్రీ హిట్ అయితే దక్కించుకోలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు రాబోయే సినిమాతో ఇండస్ట్రీ హిట్ దక్కడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ మిగలబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…
ఇక మహేష్ బాబు ఒక సినిమా చేయాలి అంటే ముందుగా అతను కథ విన్న తర్వాత మహేష్ బాబు భార్య అయిన నమ్రత ఆ కథను విని అందులో లోటుపాట్లు డైరెక్టర్ తో డిస్కస్ చేసి అతనితో చేంజెస్ చేయించిన తర్వాత ఫైనల్ గా మరోసారి మహేష్ బాబు ఆ కథను విని ఓకే చేస్తాడు. ఇక మొత్తానికైతే నమ్రత కనక ఆ స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేసిందంటే మాత్రం మహేష్ బాబు ఆ సినిమాను చేసే అవకాశాలైతే లేవు అంటూ మరి కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.
మరి మొత్తానికైతే మహేష్ బాబు సక్సెస్ ఫుల్ గా సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లడంలో తన భార్య అయిన నమ్రత కీలకపాత్ర వహిస్తూ వస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు లాంటి నటుడు చాలా అరుదుగా ఉంటారు. ఆయన ఎలాంటి క్యారెక్టర్ లో అయిన సరే అలావోకగా నటించి మెప్పిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన డిఫరెంట్ సినిమాలను చేస్తు మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటారు.
Also Read : ఆ విషయాలో మహేష్ బాబు కంటే ఎన్టీఆర్ చాలా బెస్ట్…