Mahesh Babu Mother Passes Away: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిర స్వర్గస్తులయ్యారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె బుధవారం తెల్లవారు జామున నాలుగు గంటలకు మృతి చెందారు. దీంతో తెలుగు చలన చిత్ర ప్రముఖులు సంతాపం తెలిపారు. మహేశ్ బాబును పలువురు ఓదార్చారు. కృష్ణ, ఇందిర దంపతులకు ఐదుగురు సంతానం. రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని సంతానంగా ఉన్నారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు కొడుకులు రమేశ్ బాబు, మహేశ్ బాబు సినిమాల్లో రాణించగా కూతురు మంజుల కూడా కొన్ని చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఇందిర పుట్టిన రోజు, మదర్స్ డే, ఉమెన్స్ డే సందర్భాల్లో తమ తల్లికి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి సంతోషపెట్టేవారు మహేశ్ బాబు. గతంలో మరో భార్య విజయనిర్మల మరణించగా ఇప్పుడు ఇందిర దూరం కావడంతో కృష్ణ శోకసంద్రంలో మునిగిపోయారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో కొద్ది రోజులు చెన్నైలో ఉండి చికిత్స తీసుకున్నా వ్యాధి నయం కాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆయుర్వేద మందులు కూడా వాడుతున్నారు. అయినా ఆమె ఆరోగ్యం కోలుకోకపోవడంతో తుది శ్వాస విడిచారు.
Also Read: Manchu Vishnu: మంచు విష్ణు పై ట్రోల్స్ వెనుక ఓ స్టార్ హీరో ?.. విష్ణు సంచలన కామెంట్స్ !
తల్లి అంటే మహేశ్ బాబుకు చాలా ఇష్టం. ఆయన ఎక్కడకు వెళ్లినా తల్లిని తీసుకుని పోయేవారు. ఇందిరా దేవికి కూడా మహేశ్ బాబు అంటే చాలా ఇష్టమే. తన కొడుకు తెలుగు చిత్ర సీమలో అగ్ర హీరోగా కొనసాగడంపై పలుమార్లు సంతోషం వ్యక్తం చేసేది. ఈ క్రమంలో మహేశ్ బాబుకు పలువురు చిత్ర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కోలుకుంటుందని అనుకున్న సమయంలో తన తల్లి దూరం కావడం మహేశ్ ను షాక్ కు గురి చేసింది. ఇంతకు ముందే నాలుగైదు రోజులు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోగా ఇక ఫర్వాలేదని వైద్యులు చెప్పడంతో ఇంటికి తిరిగి వచ్చింది.

ఈ నేపథ్యంలో మహేశ్ బాబు తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఇందిరా దేవికి పలువురు నివాళులు అర్పించారు. పద్మాలయ స్టూడియోలోని తన సొంత గృహంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం బాధాకరమే. వారి పెద్ద కొడుకు రమేశ్ బాబు ఇదివరకే చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఇందిరా దేవి దూరం కావడం వారి కుటుంబానికి కోలుకోలేని దెబ్బ. సినీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వారికి తల్లి కానరాని లోకాలకు వెళ్లడం నిజంగా షాక్ అనే చెప్పాలి. వారి కుటుంబానికి చిరంజీవి సహా పలువురు సంతాపం తెలిపి ఓదార్చారు.
[…] Also Read: Mahesh Babu Mother Passes Away: మహేష్ బాబు తల్లి మృతి: చిర… […]
[…] Also Read: Mahesh Babu Mother Passes Away: మహేష్ బాబు తల్లి మృతి: చిర… […]
[…] Also Read: Mahesh Babu Mother Passes Away: Mahesh Babu’s mother passes away: Chiranjeevi and other film c… […]