Kubera Glimpse : టైటిల్ తోనే ప్రేక్షకులను ఆకర్షించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ధనుష్-నాగార్జునల మల్టీస్టారర్ కి కుబేర అనే ఒక భిన్నమైన టైటిల్ ఫిక్స్ చేశాడు. ఫిదా తో బ్లాక్ బస్టర్ కొట్టిన శేఖర్ కమ్ముల చాలా గ్యాప్ అనంతరం కుబేర చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. కుబేర ధనుష్ ప్రధానంగా తెరకెక్కుతుంది. అయితే నాగార్జున సైతం కీలక రోల్ చేస్తున్నారు. కాబట్టి ఇది మల్టీస్టారర్ అనొచ్చు.
ఇక కుబేర టీజర్ పరిశీలిస్తే.. ధనుష్ లుక్ దారిద్ర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ వలె ఉంది. చిరిగిన, మురికి బట్టలతో దాదాపు బిచ్చగాడిలా ఉన్నాడు. అదే సమయంలో నాగార్జునను వేల కోట్లకు అధిపతిగా పరిచయం చేశారు. గది నిండా గుట్టలు గుట్టలుగా ఉన్న నోట్ల కట్టల మధ్య నిలుచున్న నాగార్జునతో కూడిన షాట్ గూస్ బంప్స్ రేపింది. కాబట్టి కుబేర చిత్రంలో ధనుష్ ఒక బికారి, నాగార్జున అతిపెద్ద కోటీశ్వరుడు.
వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేది కథలో అసలు ట్విస్ట్. టీజర్ చివర్లో తెల్లబట్టలు ధరించిన ధనుష్ దేవుడికి దండం పెడుతున్నట్లు చూపించారు. ఇక హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందాన లుక్ సైతం చాలా ఆర్డినరీగా ఉంది. ఆమె కూడా పేద అమ్మాయిగా కనిపించింది. అంతకు మించి టీజర్లో పెద్దగా డీటెయిల్స్ లేవు. మొత్తంగా టీజర్ క్యూరియాసిటీ పెంచింది. సినిమాపై ఆసక్తి రేపింది.
A blend of action, drama, and cinematography!
All the very best…#KuberaGlimpse https://t.co/TwLo74arko @dhanushkraja @iamnagarjuna @iamRashmika @sekharkammula @ThisIsDSP@AsianSuniel #Puskurrammohan @SVCLLP @amigoscreation @KuberaTheMovie— Mahesh Babu (@urstrulyMahesh) November 15, 2024
ఇక దేవిశ్రీ ప్రసాద్ బీజీఎం డిఫరెంట్ గా ఉంది. శేఖర్ కమ్ముల మరోసారి తన మార్కు చిత్రంతో వస్తున్నాడనిపిస్తుంది. అదే సమయంలో ఇది తన గత చిత్రాలకు భిన్నమైనది కూడా అని చెప్పొచ్చు. కారణం.. శేఖర్ కమ్ముల సినిమాల్లో పాత్రలు చాలా స్టైలిష్ గా ఉంటాయి. ధనుష్ రోల్ ని డీగ్లామర్ గా పరిచయం చేశాడు. చూడాలి సినిమా ఎలా ఉంటుందో. సునీల్ నారంగ్, రామ్ మోహన్ పూసుకుర్ నిర్మిస్తున్నారు.