
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోల్లోనే అత్యంత అందగాడిగా చెప్పొచ్చు. ఆయన స్టైల్ మేనరిజం మరో హీరోకు రాదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ‘సర్కారి వారి పాట’ సినిమాలో ‘పోకిరీ’ సినిమాలోలా పెద్ద జుట్టుతో కనువిందు చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సర్కారి వారి పాటలో తాజాగా కారునుంచి దిగుతున్న మహేష్ బాబు ఫొటో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆరడుగుల అందగాడి మరో ఫొటో తాజాగా సోషల్ మీడియాలో లీకైంది.
40 ఏళ్లు దాటినా మహేష్ బాబు అందం పెరుగుతుందే కానీ.. ఎంతకూ తగ్గడం లేదు. నవ యువకుడిలా ఇతగాడు కనిపిస్తున్నాడు. తాజాగా ‘సర్కారి వారి పాట’ మూవీలో లాంగ్ హెయిర్ తో.. మెడ మీద టాటూతో మహేష్ బాబు అదరగొడుతున్నాడు.
తాజాగా మహేష్ బాబు ఫొటో మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫొటో షేక్ చేస్తోంది. ఈ ఫొటోలో టక్కుతో మహేష్ బాబు ఎంత స్టైలిష్ గా ఉన్నాడో చూసి ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఫార్మల్ డ్రెస్ లో థిక్ బ్లూ షర్ట్ తో టక్ వేసుకొని మాస్క్ పెట్టుకొని వస్తున్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎవరు ఎక్కడ తీశారో తెలియదు కానీ లుక్ చూస్తేనే గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది.