Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ పేరు చెబితే చాలు ఆయన్ని డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని అందరూ చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే అప్పట్లో ఇండస్ట్రీలో ఏది కొత్తగా రావాలన్నా అది ముందు కృష్ణ గారే తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఆయన దేనికి భయపడేవాడు కాదు. ఆయన ఒకసారి ఒక సినిమాకి కనెక్ట్ అయ్యాడు అంటే ఆ సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాడు.
అంత డెడికేషన్ తో వర్క్ చేశారు కాబట్టే ఆయన సూపర్ స్టార్ గా ఎదిగాడు. అలాగే చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో తన సేవలను అందించగలిగాడు. ఇక ఆయన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు కొన్ని సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేసిన విషయం చాలా మంది కి తెలియదు. అన్ని సినిమాల విషయం పక్కన పెడితే, ఒక సినిమాని రిజెక్ట్ చేసినందుకు మాత్రం మహేష్ బాబు బాగా బాధపడ్డట్టుగా తెలుస్తుంది.
ఇక ఆ సినిమా ఏటంటే.? సుకుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాన్నకు ప్రేమతో… అవును మీరు విన్నది నిజమే సుకుమార్ మొదట ఈ సినిమాని మహేష్ బాబు తో చేద్దాం అని వన్ సినిమా సెట్స్ లోనే ఆ స్టోరీ ని మహేష్ బాబుకి వినిపించాడట. అయితే అప్పటికే వీళ్ళు చేస్తున్న వన్ సినిమా సెట్స్ మీద ఉంది అది సక్సెస్ అయితే మహేష్ బాబు తో ఈ సినిమా చేయాలని సుకుమార్ అనుకున్నాడట, కానీ వన్ సినిమా ఫ్లాప్ అవడంతో సుకుమార్ ఈ సినిమాని ఎన్టీఆర్ తో చేశాడు.
ఇక ఆ సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు ఫస్ట్ టైం ఒక సినిమాను రిజెక్ట్ చేసినందుకు బాధపడ్డట్టుగా అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. ఇక మహేష్ తన సన్నిహితుల దగ్గర సుకుమార్ ఈ కథను ముందే తనకి చెప్పాడు కానీ వన్ ఫ్లాప్ అవడంతో తనకు మరో అవకాశం ఇవ్వకుండా అయిపోయింది అంటూ బాధపడ్డట్టుగా తెలుస్తుంది…