Mahesh Babu Rajamouli Movie: కొంతమంది దర్శకులు ఇండస్ట్రీ లో వాళ్ల స్థాయిని పెంచుకోవాలని చూస్తారు, అలా కాకుండా మరీ కొంత మంది మాత్రం ఇండస్ట్రీ స్థాయిని పెంచుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. వాళ్లలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటివరకు ఈయన చేసిన అన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ప్రతి హీరో కి తను సూపర్ సక్సెస్ లను ఇచ్చాడనే చెప్పాలి.
ముఖ్యంగా ఈయన చేసిన బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమా సత్తా చాటాడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమా స్థాయి ని పెంచింది. ఇక ఇండియన్ సినిమాని ప్రపంచ పటంలో నిలిపింది. ఇక ఇప్పుడు ఆయన మహేష్ బాబు తో ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళితో అనవసరంగా సినిమాకి కమిట్ అయ్యానా అని, తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే దాదాపు మూడు సంవత్సరాలు ఆయన సినిమాకే స్టిక్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే రాజమౌళి ఒక్కో షాట్ కోసం విపరీతంగా హీరోలను కష్టపెడుతాడు అనే విషయం త్రిబుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్ టైమ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ తెలియజేశారు.
ఇక ఇలాంటి సమయంలో మహేష్ బాబు రాజమౌళి పెట్టె ఇబ్బందులను ఎదుర్కోలేననే ఉద్దేశంతోనే అనవసరంగా రాజమౌళితో సినిమా కమిట్ అయ్యానా అనే డైలమాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా అన్ని రికార్డ్ లను బ్రేక్ చేస్తుందని అభిమానులు అనుకుంటుంటే మహేష్ బాబు తన సన్నిహితుల దగ్గర ఇలా మాట్లాడడం చూస్తున్న అభిమానులకి కొంతవరకు నిరాశ అయితే ఎదురవుతుంది.
మరి మహేష్ బాబు ఎంతవరకు తన ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాలో నటిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడే మహేష్ బాబు అలా అంటున్నాడు అంటే సినిమా స్టార్ట్ అయ్యాక షూటింగ్ సజావుగా సాగుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…