Mahesh Babu-Rajamouli Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి… ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇంకా ఈ సినిమా కూడా భారీ సక్సెస్ ని సాధిస్తే ఆయన క్రేజ్ తారా స్థాయికి వెళ్ళిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోగలిగే ఈ స్టార్ డైరెక్టర్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఎలాంటి సినిమాలను చేస్తాడనేది తెలియాల్సి ఉంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేస్తానని అనౌన్స్ చేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది.
ఇంకా ఇప్పటివరకు ఈ సినిమా ఇంకా సెట్స్ మీదికి వెళ్ళలేదు. ఇక సంవత్సర కాలం నుంచి మహేష్ బాబు అయితే ఖాళీగానే ఉంటున్నాడు. దానివల్ల ఆయన చాలా వరకు నష్టపోతున్నాడు అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఇప్పుడు కక్కలేని మింగలేని పరిస్థితిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే సినిమా ఆల్రెడీ కమిట్ అయ్యాడు. మరో సినిమా చేయడానికి వీలు లేదు.
ఇక ఈ సినిమా స్టార్ట్ అయ్యే లోపు గ్యాప్ లో ఇంకో సినిమా చేద్దామంటే ఆల్రెడీ ఈ సినిమాకి సంభందించిన మేకోవర్ లో సెట్ అయి ఉన్నాడు. కాబట్టి మరొక సినిమాలో కూడా అదే లుక్ తో కనిపించడం చాలా కష్టమవుతుంది. ఇక మొత్తానికైతే రాజమౌళి మహేష్ బాబును తెలియకుండా లాక్ చేశారనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఎప్పటికప్పుడు ఈ సినిమాకి సంబంధించిన డేట్లు మారుతూ వస్తున్నప్పటికి సినిమా మాత్రం సెట్స్ మీదకి వెళ్లడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రాజమౌళి మహేష్ బాబు ఇద్దరు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తారు అనేది…