Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్… ఇప్పటివరకు ఆయన ఎంటైర్ కెరియర్ లో చాలా సినిమాలు చేశాడు. ఇక రాజమౌళితో చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియాలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా అవతారం ఎత్తాడు. మరి ఇలాంటి ఆయన ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా భారీ రాబడుతుందనే కాన్ఫిడెంట్ ని ప్రేక్షకులందరూ వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా పాన్ ఇండియాలో ఆయన మరోసారి తన సత్తాను చూపించాలి అంటే మాత్రం ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకునే ముందుకు సాగుతున్న రామ్ చరణ్ తన తండ్రి అయిన మెగాస్టార్ పేరును చెడిపోకుండా చూసుకుంటూ వస్తున్నాడు. ఇక చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీ కి వచ్చినప్పటికి ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనిపించేంతలా పాన్ ఇండియాలో గుర్తింపునైతే సంపాదించుకున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో 2025 లో మొదటి సక్సెస్ ని నమోదు చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో భారీ ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా కలెక్షన్స్ రూపంలో కూడా వెయ్యి కోటకు పైన కలెక్షన్స్ ని రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటివరకు ‘త్రిబుల్ ఆర్’ సినిమాకి 1300 కోట్ల రూపాయలు వచ్చాయి. అందులో ఇద్దరు హీరోలు ఉన్నారు. కాబట్టి రామ్ చరణ్ క్రెడిబిలిటీ కూడా పెద్దగా లేదనే చెప్పాలి. కాబట్టి సోలో హీరోగా వస్తున్న ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా దర్శకుడు శంకర్ కూడా ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు తద్వారా వీళ్లకు పాన్ ఇండియాలో ఎలాంటి గుర్తింపు వస్తుంది అనేది…