Mahesh Babu(7)
Mahesh Babu: శోభిత ధూళిపాళ్ల… ఈ పేరు గత నాలుగైదు రోజులుగా టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తుంది. హీరో నాగ చైతన్యతో ఆమెకు నిశ్చితార్థం జరగడమే ఇందుకు కారణం. ఆమె అక్కినేని వారి ఇంటి కోడలు కానుంది. ఆగస్టు 8న శోభిత ధూళిపాళ్ల-నాగ చైతన్యల ఎంగేజ్మెంట్ నిరాడంబరంగా జరిగింది. మంచి ముహూర్తం కుదరడంతో కార్యక్రమం హడావుడిగా ముగించామని నాగార్జున అనంతరం వివరణ ఇచ్చారు. పెళ్ళికి కొంత సమయం ఉందని అన్నారు.
నిశ్చితార్థం ముగిసిన కాసేపటికి నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కొత్త జంట ఫోటోలు షేర్ చేశారు. శోభిత ధూళిపాళ్లను తన కుటుంబంలోకి కొత్త సభ్యురాలిగా ఆహ్వానిస్తున్నట్లు తెలియజేశారు. శోభిత-నాగ చైతన్య కలకాలం ప్రేమానురాగాలతో, సంతోషంగా కలిసి జీవించాలని ఆయన కాంక్షించారు. నాగ చైతన్య-శోభితకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
కొన్నాళ్లుగా శోభితతో నాగ చైతన్య రిలేషన్ లో ఉన్నాడని సమాచారం. పలుమార్లు వీరు జంటగా విదేశాల్లో విహరించారు. నాగ చైతన్య, శోభిత కలిసి ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాగ చైతన్య-శోభిత మధ్య ఎఫైర్ నడుస్తుందని కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లను నాగ చైతన్య టీమ్ తో పాటు శోభిత ధూళిపాళ్ల ఖండించడం విశేషం. సడన్ గా నిశ్చితార్థం జరుపుకుని ఒకింత షాక్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే శోభిత ధూళిపాళ్లకు మహేష్ బాబు కారణంగా ఓ సందర్భంలో చేదు అనుభవం ఎదురైంది. పబ్లిక్ లో మహేష్ బాబు ఆమె గాలి తీసేశాడు. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన మేజర్ పాన్ ఇండియా చిత్రంగా విడుదలైంది. ఈ మూవీ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం. మేజర్ మూవీలో శోభిత ధూళిపాళ్ల నటించింది. మేజర్ చిత్రాన్ని మహేష్ బాబు తన బ్యానర్ లో నిర్మించారు.
మేజర్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు, శోభిత, అడివి శేష్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో శోభిత ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే మధ్యలో కల్పించుకొని మహేష్ బాబు ‘తెలుగులో మాట్లాడవా ప్లీజ్’ అని సెటైర్ వేశాడు. దాంతో ఆ వేదికపై ఉన్నవారంతా నవ్వేశారు. ఎలా కవర్ చేసుకోవాలో తెలియక… శోభిత తన బ్యాక్ గ్రౌండ్ బయటపెట్టింది.
నేను తెలుగు అమ్మాయినే. పుట్టింది తెనాలిలో అయినా తెలుగు సరిగా రాదు. కారణం… నేను వైజాగ్ లో స్కూలింగ్ చేశాను. ముంబైలో డిగ్రీ పూర్తి చేశాను. అక్కడే ఉంటూ మోడలింగ్ చేశాను. ఫెమినా మిస్ ఇండియా 2013లో పాల్గొని విజేతను అయ్యానని… చెప్పుకొచ్చింది. శోభితను కించపరచాలనే ఉద్దేశం మహేష్ బాబుకు లేదు. మహేష్ స్పాంటేనియస్ గా జోక్స్ వేస్తారు. అలాగే అది మేజర్ మూవీ తెలుగు వెర్షన్ ప్రమోషనల్ ఈవెంట్. అందుకే మహేష్ బాబు ఆమెకు తెలుగులో మాట్లాడాలని సూచించాడు.
నిజానికి మహేష్ బాబుకు కూడా తెలుగురాదు. ఆయన చెన్నైలో చదువుకున్నాడు. చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం. దాని వలన తెలుగు చదవడం మహేష్ బాబుకు రాదు. స్క్రిప్ట్, డైలాగ్స్ ఇంగ్లీష్ లో టైప్ చేసి ఇవ్వాలి. మహేష్ బాబు మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తాయి.
Web Title: Mahesh babu insulted nagarjuna daughter in law sobhita in public do you know what he said
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com