Vijay Devarakonda- Samantha: సమంత ముక్కుసూటి మనిషి. కెరీర్ బిగినింగ్ లోనే ఆమె స్టార్ హీరోలను టార్గెట్ చేసి మాట్లాడింది. ఒక సినిమా విజయంలో హీరో, హీరోయిన్ కి సమాన పాత్ర ఉంటుంది. రెమ్యునరేషన్ లో మాత్రం వ్యత్యాసం ఎందుకంటూ ఓ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టింది. సమంత డేర్ కి చాలా మంది షాక్ అయ్యారు. ఎదుగుతున్న సమయంలో హీరోయిన్స్ ఎవరూ అలాంటి రిస్క్ చేయరు. దీంతో పాటు సమంత గతంలో మహేష్ బాబు సినిమాను టార్గెట్ చేయడం సంచలనమైంది.
దర్శకుడు సుకుమార్ మహేష్ బాబు హీరోగా వన్ నేనొక్కడినే తెరకెక్కించారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ‘హలో రాక్ స్టార్’ సాంగ్ లో మహేష్ బీచ్ లో నడుస్తుంటే, కృతి సనన్ చేతులతో ఆయన అడుగు జాడలను తాకుతుంది. ఈ పోస్టర్ పై సమంత అభ్యంతరం చెప్పింది. 2013 డిసెంబర్ లో వన్ నేనొక్కడినే పోస్టర్ ని తప్పుబడుతూ సమంత ట్వీట్ చేసింది.
సదరు ట్వీట్లో సమంత… విడుదలకు సిద్ధంగా ఉన్న ఓ చిత్ర పోస్టర్ చాలా అభ్యంతరకరంగా ఉంది. మనోభావాలు తెబ్బతీస్తూ, కించపరిచే భావం కలిగి ఉంది, అని కామెంట్ చేశారు. అబ్బాయి కాళ్ళను అమ్మాయి తాకడం స్త్రీలను అవమానించడమే.ఆడవాళ్లను మగాళ్ల బానిసలు అన్నట్లు మహేష్ బాబు చిత్ర పోస్టర్ ఉందని సమంత పరోక్షంగా అభిప్రాయపడ్డారు. సమంత ట్వీట్ పై మహేష్ ఫ్యాన్స్ మండిపడ్డారు. సన్నివేశంలో భాగంగా జరిగిన విషయాన్ని బూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని సమంతకు కౌంటర్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఆ సంఘటన జరిగి పదేళ్లు అవుతుండగా మహేష్ బాబు ఫ్యాన్స్ కి సమంత బుక్ అయ్యారు. ఖుషి మూవీ నుండి విడుదలైన ఆరాధ్య సాంగ్ లో విజయ్ దేవరకొండ సోపాలో పడుకొని ఉండగా సమంత అతని కాళ్ళ దగ్గర కూర్చొని ఉంది. విజయ్ తన కాలితో సమంత చేతిని తంతున్న ఓ షాట్ ఉంది. అది బయటకు తీసి సమంతను ఆడుకుంటున్నారు. ఆ రోజు కేవలం మహేష్ అడుగు జాడలను తాకినందుకే తప్పుబట్టావ్, ఇప్పుడు విజయ్ దేవరకొండ ఏకంగా కాలితో నిన్ను తాకాడంటూ ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అవుతుంది.
https://twitter.com/Nikhil_Prince01/status/1679114030412333056?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1679114030412333056%7Ctwgr%5Ecc552537df52dcc903fff2446df9b659032ce153%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftrolling-samantha-kushi-song-1692249