Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) లాంటి నటుడు సైతం వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికి తనదైన రీతిలో నటనను కనబరుస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదగడమే కాకుండా నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకునే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో యావత్ ప్రపంచ ప్రేక్షకులందరిని మెప్పించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబుతో అవకాశం వస్తే ప్రతి ఒక్కరు ఒక పెద్ద సినిమాను చేసి భారీ విజయాన్ని సాధించాలని చూస్తూ ఉంటారు. కానీ బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) అనే దర్శకుడు మాత్రం మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం వస్తే రొటీన్ సినిమాలను కాకుండా ఆయనను చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తానని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
Also Read : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కృష్ణ సీన్ ను రీక్రియేట్ చేస్తున్నారా..?
మహేష్ బాబు చాలా మంచి నటుడు అని అతనితో సినిమా చేసే అవకాశం వస్తే అతన్ని శవాల దగ్గర డ్యాన్స్ చేసేటువంటి ఒక పాత్రలో చూపించి అందులోని ఎమోషన్ ని ప్రేక్షకులకు రీచ్ అయ్యేవిధంగా సినిమాలు చేస్తానని చెప్పాడు. బండి సరోజ్ కుమార్ అంటే చాలామందికి మంచి అవగాహన అయితే ఉంటుంది.
ఎందుకంటే యూట్యూబ్ లో ఆయన నిర్బంధం (Niebhandam), మాంగల్యం (Mangalyam) లాంటి సినిమాలను చేశాడు. అవి ప్రేక్షకుల్లో మంచి ఆదరణను సంపాదించుకున్నాయి. ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉందనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఆయన తనే హీరోగా డైరెక్టర్ గా చేస్తూ ఉంటాడు. ఒకవేళ స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం వస్తే మాత్రం ప్రతి ఒక్క హీరోని డిఫరెంట్ గా చూపించడానికి ప్రయత్నం చేస్తానని ఒకానొక సందర్భంలో తెలియజేశాడు.
ఇక మహేష్ బాబు అంటే తనకు చాలా ఇష్టమని అతని నటన పొటెన్షియాలిటీని బయటికి తీసే సినిమాలేవి రావడం లేదని చెప్పాడు. అలాగే ఒకే రకమైన క్యారెక్టర్స్ ను పోషిస్తూ ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తున్నాడని ఆయన కెపాబులిటీని వాడుకోవడం లేదని కామెంట్స్ కూడా చేశాడు… ఇక ఏది ఏమైనా ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకోవాలని తద్వారా ఆయనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు.
Also Read : మహేష్ సినిమాని చూసి పుస్తకాన్ని చింపి పారేసిన రాజమౌళి..అసలు ఏమైందంటే!