Mahesh Babu Birthday: సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) గురించి అభిమానులకు తెలియని విషయమంటూ ఏది లేదు. మహేష్ బాబు అయినా తనకు సంబంధించినవి ఏవైనా మర్చిపోయి ఉండొచ్చేమో కానీ, మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఆయన హీరో గురించి ఒక్కటంటే ఒక్క విషయాన్నీ కూడా మర్చిపోరు. అలాంటి వీరాభిమానం మహేష్ బాబు సొంతం. అయితే ఆయన రెమ్యూనరేషన్ ఎంత?, ఒక్కో యాడ్ కి ఎంత తీసుకుంటాడు?, ఇతర వ్యాపారాల నుండి ఏడాదికి ఎంత సంపాదిస్తున్నాడు వంటివి మాత్రం అభిమానులకు తెలియదు. కేవలం అంచనా వెయ్యడం మాత్రమే చెయ్యగలరు. అయితే రీసెంట్ గా ఆయన పేరు మీదున్న ఆస్తుల వివరాలు, ఏడాది సంపాదన ఎంతో తెలిసింది. కేవలం మహేష్ బాబు పేరు మీద 400 కోట్ల రూపాయలకు పైగా ఉందట. అంతేకాకుండా హైదరాబాద్ లో ఉండే అందమైన ఇల్లు, ప్రైవేట్ జెట్ లతో పాటు, ముంబై మరియు బెంగళూరు లో భారీగా ఆస్తులు ఉన్నాయట.
Also Read: నాగార్జున తెలివి మాములుగా లేదుగా..?
అదే విధంగా ఆయన పేరు మీద ఒక ఆడి కారు, రేంజ్ రోవర్ ,BMW, మెర్సీ దస్ కార్లు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా తన పేరు మీద ఒక ఫౌండేషన్ ని ఏర్పాటు చేసి ఎంతో మందికి సహాయం అందిస్తున్నాడు. అయితే మహేష్ బాబు ఏడాది సంపాదన కూడా భారీగానే ఉంటుంది. ఒక్కో సినిమాకు ఆయన 60 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని తీసుకుంటూ ఉంటాడు. ఇవి కాకుండా యాడ్స్ ద్వారా సీజన్ ని బట్టి ఆయనకు 20 కోట్ల రూపాయిల అదనపు సంపాదన వస్తుంది. ఇవి కాకుండా రెస్టారంట్, AMB సినిమాస్ నుండి 30 కోట్ల రూపాయిల సంపాదన ఉంటుందని అంచనా. ఓవరాల్ గా మిగిలిన వ్యాపారాలను కూడా పరిగణలోకి తీసుకొని లెక్కేస్తే 150 కోట్ల రూపాయలకు పైగానే ఏడాది సంపాదన ఉంటుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
Also Read: ఎయిర్పోర్ట్ లో అక్క చేసిన పనికి బాలయ్య షాక్!
ఇది ఇలా ఉండగా నేడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం ఆయన రాజమౌళి తో చేస్తున్న చిత్రం గురించి ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. నవంబర్ నెలలో ఈ చిత్రానికి సంబంధించిన భారీ రివీల్ ఉంటుందని, అప్పటి వరకు అభిమానులు కాస్త ఓపిక పెట్టాల్సిందిగా కోరుతూ మహేష్ బాబు ప్రీ లుక్ ని ఒకటి విడుదల చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ రివీల్ రెగ్యులర్ గా ప్రెస్ తరహాలో కాకుండా, ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎవ్వరూ అనుసరించని పద్దతిలో ఈ రివీల్ చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనుంది. ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.