HHVM 2nd day Box Office: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో సూపర్ హిట్స్ ఉన్నాయ్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి, వీటితో పాటు ఫ్లాప్స్ మరియు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా పవన్ అభిమానులు తట్టుకోగలరు,కానీ ఒక్క డిజాస్టర్ కి మాత్రం తట్టుకోలేకపోయారు. ఆ డిజాస్టర్ పేరు ‘అజ్ఞాతవాసి’. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కామినేషన్ లో కనీవినీ ఎరుగని అంచనాల నడుమ విడుదలైన చిత్రమిది. మొదటి ఆట నుండే ఘోరమైన నెగటివ్ టాక్ రావడంతో అభిమానులు అప్పట్లో పిచోళ్లు అయిపోయారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆయన వకీల్ సాబ్ చిత్రం తో గ్రాండ్ గా సక్సెస్ ఫుల్ రీ ఎంట్రీ ఇవ్వడంతో, హీరో ట్రాక్ లోకి వచ్చేశాడు, మళ్ళీ అజ్ఞాతవాసి లాంటి ఫ్లాప్ ని చూడలేము లే అని అనుకున్నారు అభిమానులు. కానీ మొన్న విడుదలైన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) అజ్ఞాతవాసి ని మించిన ఫ్లాప్ అవ్వబోతుందా అనే సందేహాలు కలిగిస్తున్నాయి.
Also Read: వార్ 2 ట్రైలర్ రివ్యూ: ఇద్దరు రూత్ లెస్ ఏజెంట్స్ తలపడితే? బ్లాస్టింగ్ విజువల్స్!
మొదటి రోజు పవన్ కళ్యాణ్ రేంజ్ ఓపెనింగ్ వసూళ్లు కాకపోయినా కాస్త డీసెంట్ స్థాయి ఓపెనింగ్ వసూళ్లను రాబట్టింది. జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ లో 35 శాతం కి పైగా రీకవరీ చేసింది. కానీ రెండవ రోజు మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. బుక్ మై షో యాప్ లో కేవలం 98 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇక వసూళ్లు విషయానికి వస్తే అనేక థియేటర్లు డెఫిసిట్ లో పడ్డాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండవ తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. బ్రో లాంటి ఫ్లాప్ చిత్రానికే రెండవ రోజు పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్, ఈ చిత్రానికి అందులో సగం కూడా రాబట్టలేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read: ‘వార్ 2’ లో ఎవరు హీరో..? ఎవరు విలన్..? ట్రైలర్ అయ్యోమయంలోకి నెట్టేసిందిగా!
పవన్ కళ్యాణ్ కెరీర్ ఫ్లాప్ సినిమాలు కూడా కనీస స్థాయిలో వసూళ్లను రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎంత పెద్ద ఫ్లాప్ అయినా కనీసం మూడు రోజులు ఆయన సినిమాలకు ప్రతీ సెంటర్ లో హౌస్ ఫుల్స్ నమోదు అయ్యేవి. కానీ మొదటి రోజు మినహా, మిగిలిన రోజుల్లో ఘోరమైన డిజాస్టర్ గా నిల్చిన చిత్రాలు జానీ, అజ్ఞాతవాసి, ఇప్పుడు రీసెంట్ గా ‘హరి హర వీరమల్లు’ చిత్రం కూడా ఆ జాబితాలో చేరింది. సినిమాకు ప్రీమియర్ షో నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ రావడం, రెండవ రోజు వర్కింగ్ డే అవ్వడం వల్లే పెద్ద దెబ్బ పడిందని, నేడు, రేపు వీకెండ్ కాబట్టి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.