
సూపర్ స్టార్ మహేష్ బాబు మరో పిలుపునిచ్చాడు. ఆగస్టు 9న తన పుట్టిన రోజు వేడుకలకు సిద్ధమవుతున్న తన అభిమానులకు అలా డబ్బులు వృథా చేయవద్దని ఇలాంటి మంచి పని ఒకటి చేయాలని సూచించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు.
టాలీవుడ్ లో సూపర్ స్టార్ అయిన మహేష్ బాబుకు తెలుగులో అభిమానగణం ఎక్కువ. మహిళలు, యువతులు మహేష్ అంటే పడి చస్తారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. ఇప్పటికే సూపర్ స్టార్ అభిమానులు హడావుడి చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తన పుట్టిన రోజున ఫ్యాన్స్ అందరూ ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టాలని మహేష్ బాబు తాజాగా తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
తన పుట్టినరోజు కానుకగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని మహేష్ బాబు ఈ సందర్భంగా తన అభిమానులకు ఇన్ స్టాగ్రామ్ వేదికగా పిలుపునిచ్చారు. నా మీద ఉన్న ప్రేమతో మీరు చేసే పనులన్నీ నన్ను ఇంకా ప్రేరేపిస్తున్నాయని.. ఈ సంవత్సరం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’కు మద్దతుగా నా పుట్టినరోజు నాడు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటే ఫొటోలను షేర్ చేస్తూ నన్ను ట్యాగ్ చేయండని కోరారు. అప్పుడే నేను మీ అభిమానాన్ని చూడగలను అని మహేష్ పోస్ట్ చేశాడు.
ఆగస్టు 9న మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారివారి పాట’ మూవీ టీజర్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా స్టిల్స్ పోస్టర్ లు విడుదలై రికార్డు సృష్టిస్తున్నాయి. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
https://www.instagram.com/p/CSOL43lnkcK/?utm_source=ig_web_copy_link