https://oktelugu.com/

ఎన్టీఆర్ ముందు మహేష్ నిలబడగలడా..?

నేషనల్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తర్వాతి చిత్రం మహేష్ బాబుతోనే అని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. నిజానికి మహేష్ రాజమౌళితో సినిమా చేయడానికి ఎన్నో సంవత్సరాలుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ, ప్రతి సంవత్సరం లెట్ అవుతూనే వచ్చింది. కానీ ఎట్టేకలకు సినిమా ఫిక్స్ అయింది. ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్ తోనే సినిమా. కాకపోతే, ఈ సినిమా కూడా మల్టీస్టారరే అని.. మహేష్ తో పాటు మరో స్టార్ హీరో కూడా సినిమాలో ఉంటాడని మళ్ళీ రూమర్స్ మొదలయ్యాయి. […]

Written By:
  • admin
  • , Updated On : January 5, 2021 / 01:00 PM IST
    Follow us on


    నేషనల్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తర్వాతి చిత్రం మహేష్ బాబుతోనే అని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. నిజానికి మహేష్ రాజమౌళితో సినిమా చేయడానికి ఎన్నో సంవత్సరాలుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ, ప్రతి సంవత్సరం లెట్ అవుతూనే వచ్చింది. కానీ ఎట్టేకలకు సినిమా ఫిక్స్ అయింది. ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్ తోనే సినిమా. కాకపోతే, ఈ సినిమా కూడా మల్టీస్టారరే అని.. మహేష్ తో పాటు మరో స్టార్ హీరో కూడా సినిమాలో ఉంటాడని మళ్ళీ రూమర్స్ మొదలయ్యాయి. ఆ హీరో ఎన్టీఆరే అనేది మరో ఇంట్రస్టింగ్ టాక్. పైగా సినిమా పురాణాల ఆధారంగా రాసుకున్న కథతో అట.

    Also Read: సీనియర్ ఎన్టీఆర్ – మెగాస్టార్’ వాయిస్ ఓవర్ తో ‘తారక్ – చరణ్’ టీజర్ !

    ఇక పురాణాల సినిమా అంటే ఎన్టీఆర్ ముందు మహేష్ నిలబడగలడా..? పైగా మహేష్ కి అలాంటి సినిమాలు అసలు సరిపడవు. మహేష్ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా తేలిపోతుంది. ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ పరిస్థితి ఇప్పటికే అందరికీ అర్ధం అయింది. ఎన్టీఆర్ ముందు చరణ్ నటనా చాతుర్యం బాగాలేదనేది ‘ఆర్ఆర్ఆర్’ టీంలోని సభ్యుల మాటే. దాంతో చరణ్ కి ‘ఆర్ఆర్ఆర్’ ప్లస్ కంటే మైనసే ఎక్కువయ్యేలా ఉంది. ఇప్పుడు మహేష్ పరిస్థితి కూడా అదే. మరి చూడాలి.. మహేష్ రాజమౌళితో ఎలా మ్యానేజ్ చేస్తాడో.

    Also Read: డబ్బింగ్ మొదలైంది.. స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌ గా వస్తాడట !

    ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే “ఆర్ఆర్ఆర్” దసరాకే విడుదల అవుతుంది. ఒకవేళ 2022 సంక్రాంతికి విడుదల అయినా.. రాజమౌళి తన నెక్స్ట్ మూవీని 2022లోనే స్టార్ట్ చేస్తాడు. ఇప్పటికే బేసిక్ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయిందట. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నారాయణ నిర్మాతగా తెరకెక్కనుంది. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇంకా కథ మీదే కూర్చున్నాడు. ఏది ఏమైనా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో, సినిమా కూడా ఆ రేంజ్ సినిమా అవుతుందనేది అభిమానుల ఆశ.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్