Mahesh Babu: గుంటూరు కారం మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు మహేష్ బాబు. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సంక్రాంతి సీజన్ ని మహేష్ క్యాష్ చేసుకున్నాడు. త్రివిక్రమ్ డైరెక్టర్ గా ఫెయిల్ అయినా… మహేష్ మేనియాతో మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. గుంటూరు కారం వరల్డ్ వైడ్ రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. గుంటూరు కారం విడుదల అనంతరం మహేష్ జర్మనీ వెళ్లారు. ఎక్కడికైనా కుటుంబంతో వెళ్లే మహేష్ బాబు, ఈసారి ఒంటరిగా వెళ్లారు.
మహేష్ బాబు జర్మనీ టూర్ వెనుక కారణం ఉందనేది లేటెస్ట్ టాక్. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సన్నద్ధం అయ్యేందుకే మహేష్ బాబు జర్మనీ వెళ్లినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు-రాజమౌళి చిత్రం ఈ ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లనుంది. స్క్రిప్ట్ కూడా లాక్ చేసిన రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఇక తన హీరోలను సరికొత్తగా ప్రజెంట్ చేయడంలో రాజమౌళి దిట్ట. అందుకు సదరు హీరోలను విపరీతంగా కష్టపెడతారు.
మహేష్ సైతం రాజమౌళి సినిమాలో గతంలో ఎన్నడూ చూడని విధంగా దర్శనం ఇవ్వనున్నాడట. మహేష్ లుక్ పై రాజమౌళి ఇప్పటికే కొన్ని స్కెచ్ లు సిద్ధం చేయించాడట. వాటిలో రాజమౌళి ఎంపిక ఆధారంగా మహేష్ మేకోవర్ కావాల్సి ఉంది. లుక్ టెస్ట్ కే నెల రోజులు కేటాయించారని సమాచారం. జర్మనీ వెళ్లిన మహేష్ బాబు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ డాక్టర్ అయిన హ్యారీ కోనిగ్ ని కలిశారు. ఈయన హోలిస్టిక్ నాచురోపతి స్పెషలిస్ట్.
హ్యారీ కోనిగ్ వద్ద మహేష్ బాబు శిక్షణ తీసుకుంటున్నారు. కాగా ఆయనతో కలిసి జర్మనీ అడవుల్లో మహేష్ బాబు సాహసాలు చేస్తున్నాడు. గడ్డ కట్టించే చలిలో బ్లాక్ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ కి వెళ్ళాడు. సదరు ఫోటోలు మహేష్ బాబు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక రాజమౌళి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇది జంగిల్ అడ్వెంచర్ డ్రామా. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ కనిపిస్తాడని సమాచారం.
View this post on Instagram