Anup Rubens: అతని సంగీతంలో ఒక ఉత్తేజం ఉంటుంది. అతని స్వరంలో ఒక ‘ఉత్సాహాం ఉంటుంది. నిజానికి ఘంటసాల నుంచి ఇళయరాజా దాకా, రాజ్ కోటి నుంచి మణిశర్మ దాకా.. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ నుంచి థమన్ దాకా.. ఇలా ఎందరో సంగీత దర్శకులు టాలీవుడ్ లో తమ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నారు. అసలు వీళ్ళ ప్రభావంలో ఒక కుర్రాడు వచ్చి సంగీత దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. కానీ ఆ అసామాన్యమైన విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు అనూప్ రూబెన్స్.

అనూప్ రూబెన్స్(Anup Rubens) సంగీతానికి ఒక ప్రత్యేక శైలి ఉంది. అందుకే, ఎందరో గొప్ప సంగీత దర్శకుల సరసన అతనికి ఒక స్థానం దక్కింది. ‘జై’ సినిమాతో మొదలైన అనూప్ స్వర ప్రస్థానం.. నేటికీ విజయవంతంగా ముందుకు సాగుతుంది. పదిహేడేళ్ల తన సంగీత ప్రయాణంలో అనూప్ ఎన్నో హిట్లు కొట్టాడు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినా తన జైత్రయాత్రను మాత్రం సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తూనేే ఉన్నాడు.
ముఖ్యంగా అనూప్ లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఫాస్ట్ బీట్ నుంచి మెలొడీ వరకూ, ఇన్ స్పైరింగ్ సాంగ్స్ నుంచి పేట్రియాటిక్ మరియు ఫోక్ సాంగ్స్ వరకూ ఇలా ప్రతిదీ అద్భుతంగా కంపోజ్ చేయగలడు. అందుకే అతని కంపోజిషన్ లో ఒక స్టైల్ ఉంటుంది. ఈ క్రమంలోనే అనూప్ టచ్ చేయని జానర్ లేదు, మెప్పించని తరహా పాట లేదు.
నేటి డిజిటల్ యుగంలో వందల మిలియన్ వ్యూస్ పాటలను అందించిన ఘనత కూడా అనూప్ కే దక్కింది. మారిన ట్రెండ్ లోనూ మారని తన మ్యూజిక్ తో క్రేజీ హిట్స్ సాధించడం ఒక్క అనూప్ కే చెల్లింది. అనూప్ పనిలో ఎంత ఖచ్చితత్వంతో ఉంటారో.. బయట అంత సింపుల్ గా ఉంటారు. పాట విషయంలో ఎంత సీరియస్ గా ఉంటారో ఆ పాటతోనే అంత ఫీల్ ను పండిస్తాడు.
అందుకే, ఇష్క్, లవ్ లీ, గుండెజారి గల్లంతయ్యిందే, పూలరంగడు, మనం, భీమవరం బుల్లోడు, పిల్లా నువ్వు లేని జీవితం, టెంపర్, గోపాల గోపాల…ఇలా అనూప్ కెరీర్ లో ఎన్నో హిట్స్ ఉన్నాయి. అలాగే బాలకృష్ణతో పైసా వసూల్, నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయనా వంటి క్లాస్ అండ్ మాస్ హిట్స్ కూడా అనూప్ లిస్ట్ లో ఉన్నాయి. ఇవన్నీ అనూప్ టాలెంట్ కి నిదర్శనమే.
పైగా పవన్ తో గోపాల గోపాల, కాటమరాయుడు రెండు చిత్రాలకు స్వరాలు అందించారు అనూప్. ఇక అనూప్ కెరీర్ లో గొప్పగా చెప్పుకునే పాట ‘నీలి నీలి ఆకాశం’. ఏకంగా 274 మిలియన్ వ్యూస్ ను సాధించి, పాండమిక్ లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది ఈ పాట. అదేవిధంగా మంచి రోజులు వచ్చాయి సినిమాతో హిట్ కొట్టిన అనూప్…త్వరలోనే మరిన్ని హిట్లు ఇవ్వడానికి ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నాడు.
ఇప్పటికే నాగార్జునతో బంగర్రాజుతో లడ్డుండా ఆల్రెడీ హిట్ ఆల్బమ్ మొదలు పెట్టాడు. వెంకీతో దృశ్యం 2, రాజశేఖర్ హీరోగా వస్తున్న శేఖర్ వంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో అనూప్ మన ముందుకు రాబోతున్నాడు.
Also Read: అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ సినిమా!
తనకంటే తక్కువ వయసున్న వ్యక్తితో సింగర్ మాళవిక వివాహం..నెట్టింట్లో ఫొటోలు వైరల్!