Homeఎంటర్టైన్మెంట్Anil ravipudi:అనిల్​ రావిపూడి దర్శకత్వంలో పవన్​ సినిమా!

Anil ravipudi:అనిల్​ రావిపూడి దర్శకత్వంలో పవన్​ సినిమా!

Anil ravipudi: పవర్​స్టార్ పవన్​ కల్యాణ్ వరుస సినిమాలతో బాణంలా దూసుకెళ్లిపోతున్నాడు. ప్రస్తుతం భీమ్లనాయక్​తో బిజీగా ఉన్న పవన్​.. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హరిహర వీరమల్లు సినిమాలో నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్​ ప్రారంభమైంది. మరోవైపు, హరీశ్ శంకర్​ దర్శకత్వంలోనూ ఓ సినిమా ఒప్పుకున్నారు. ఇలా వరుస ప్రాజెక్టులతో అభిమానులకు ఊపందిస్తున్నారు పవన్​. కాగా, తాజాగా మరో వార్త ఫిల్మ్​ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రముఖ దర్శకుడు అనిల్​ రావిపూడితో కలిసి ఓ మూవీ చేసేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Anil ravipudi

కాగా, కథ విషయంలో పవన్ అనిల్​కు ఓ షరతు విధించారట. ఇప్పటికే రెడీ అయిన స్క్రిప్ట్​లో కొన్ని మార్పులు కావాలని కోరినట్లు సమాచారం హీరోయిజం నేపథ్యంలో కాకుండా.. కుటుంబమంతా కలిసి ప్రశాంతంగా నవ్వుకునేలా కథను ప్రిపేర్​ చేయమని చెప్పినట్లు సమాచారం. పటాస్​, ఎఫ్​2, సరిలేరు నీకెవ్వరు, రాజా ది గ్రేట్ వంటి సినిమాలతో సూపర్​ హిట్​ కొట్టిన అనిల్​ రావిపూడి.. ప్రస్తుతం ఎఫ్​ 3 సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు.

మరోవైపు, భీమ్లనాయక్​ సినిమాతో ఫుల్​ బిజీగా గడుపుతున్నారు పవన్​. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్​, ప్రోమోలు, సాంగ్​లు నెట్టింట వైరల్​గా మారాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా లాలా భీమ్లా పాట.. సోషల్​ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి ఈ సినిమా దిగేందుకు సిద్ధమైంది.  చెప్పడం మర్చిపోయానండోయ్​.. సురేందర్​ రెడ్డి దర్శకత్వంలోనూ పవన్ ఓ సినిమా చేయనున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular