https://oktelugu.com/

సలార్ మూవీలో విలన్ ఫిక్స్… ఎవరంటే?

ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం “సలార్”. కేజీయఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‌తో ప్రభాస్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు సినిమాను ప్రకటిస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. హీరో క్యారెక్టర్‌ ను డిఫ‌రెంట్ ‌గా డిజైన్ చేయ‌డ‌మే కాకుండా, అప్పటి వ‌ర‌కు చూడ‌ని లుక్‌ లో ప్రభాస్ ‌ను చూపించారు. అయితే ఈ ఆరడుగుల ఆజానుబాహుడిని ఢీ కొట్టే ప్రతినాయకుడు ఎవరని సర్వత్రా […]

Written By:
  • admin
  • , Updated On : February 7, 2021 / 01:23 PM IST
    Follow us on


    ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం “సలార్”. కేజీయఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‌తో ప్రభాస్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు సినిమాను ప్రకటిస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. హీరో క్యారెక్టర్‌ ను డిఫ‌రెంట్ ‌గా డిజైన్ చేయ‌డ‌మే కాకుండా, అప్పటి వ‌ర‌కు చూడ‌ని లుక్‌ లో ప్రభాస్ ‌ను చూపించారు. అయితే ఈ ఆరడుగుల ఆజానుబాహుడిని ఢీ కొట్టే ప్రతినాయకుడు ఎవరని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉండగా తాజగా దీనికి సమాధానం దొరికింది.

    Also Read: ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నోరు జారిన చిరంజీవి

    కన్నడ చిత్ర పరిశ్రమలో విలన్ పాత్రలలో బాగా పాపులర్ అయిన నటుడు ‘మధు గురు స్వామి’ని సలార్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఇక కేజీయఫ్ రెండు భాగాలలో హీరో, విలన్స్ ని డైరెక్టర్ ఏ రేంజ్ లో చూయించి ఆకట్టుకున్నాడో అందరికి తెలుసు. దానికి మించి అన్నట్లుగా సలార్ మూవీలో హీరో, విలన్ పాత్రలుంటాయని ఇప్పటికే ప్రశాంత్ పేర్కొన్నారు.

    Also Read: ‘వరుడు కావలెను’ ఎందుకు మళ్లీ రీషూట్ ?

    తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ సింగరేణిలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా… వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ కిరంగ‌దూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ ‘రాధే శ్యామ్’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఫిబ్రవరి 14న ఈ మూవీ నుండి అభిమానులకు కానుక ఇవ్వబోతున్నామని మేకర్స్ ప్రటించారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్