పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన నాని హీరోయిన్

హీరోయిన్‌గా తన తొలి సినిమాతోనే ‘నచ్చావులే’ అనిపించుకుంది తెలుగమ్మాయి మాధవీలత. ఆపై నాని హీరోగా ‘స్నేహితుడా’ చిత్రంతో కూడా ఆకట్టుకుంది. దాంతో, ఆమె కెరీర్ ఊపందుకుంటుంది అనుకుంటే రివర్సయింది. అవకాశాలు లేకపోవడంతో ఆమె తెరమరుగైంది. అయితే, ఆ మధ్య ‘మీ టూ’ ఉద్యమంలో పాల్గొనడంతో పాటు, తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ గురించి మాట్లాడి వార్తల్లోకి వచ్చింది. ఆపై, సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీ విషయాల గురించి తరచూ స్పందిస్తోంది. అంతేకాదు బీజేపీ కండువా కప్పుకొని రాజకీయాల్లోకి […]

Written By: admin, Updated On : June 6, 2020 5:10 pm
Follow us on


హీరోయిన్‌గా తన తొలి సినిమాతోనే ‘నచ్చావులే’ అనిపించుకుంది తెలుగమ్మాయి మాధవీలత. ఆపై నాని హీరోగా ‘స్నేహితుడా’ చిత్రంతో కూడా ఆకట్టుకుంది. దాంతో, ఆమె కెరీర్ ఊపందుకుంటుంది అనుకుంటే రివర్సయింది. అవకాశాలు లేకపోవడంతో ఆమె తెరమరుగైంది. అయితే, ఆ మధ్య ‘మీ టూ’ ఉద్యమంలో పాల్గొనడంతో పాటు, తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ గురించి మాట్లాడి వార్తల్లోకి వచ్చింది. ఆపై, సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీ విషయాల గురించి తరచూ స్పందిస్తోంది. అంతేకాదు బీజేపీ కండువా కప్పుకొని రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టింది.

ఎప్పుడూ సినీ, రాజకీయ వివాదాల గురించి మాట్లాడే మాధవీలత రెండు రోజుల కిందట ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ చర్చనీయాంశమైంది. ‘ఎన్నో నెలల తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నా… కొత్త జీవితం ప్రారంభమైంది. అద్భుతాలు జరిగాయి. అద్భుతాలు జరుగుతాయని నేనెప్పుడూ నమ్ముతా. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా.. ఏం జరిగిందో త్వరలో చెబుతా’ అని పోస్ట్ చేసింది. దీంతో, మాధవీలత పెళ్లి చేసేసుకుందని అభిమానులు ఓ అంచనాకు వచ్చేశారు. అంతే కాదు ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం కూడా ప్రారంభించారు. దీంతో, పెళ్లి అంశంపై మాధవి క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. అందరూ తనకు విషెస్ చెపుతుంటే తనకు నవ్వొస్తోందని వ్యాఖ్యానించింది. అయితే, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని… అన్నీ కుదిరితే వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని తెలిపింది.