Anushka Sharma: పెరుగుతున్న టెక్నాలజీని చూసి ఆనందపడాలో, లేక బాధపడాలో అర్థం కానీ పరిస్థితులు ఇటీవల కాలం లో ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా AI టెక్నాలజీ ఎదో ఒక రోజు పెద్ద సంక్షోభమే సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మానవ మేధస్సుకి పరాకాష్ట లాగా మారిన AI టెక్నాలజీ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. త్వరలోనే మన భారత దేశం లో AI రోబోట్స్ సారీ చికిత్సలు చేయడం వంటి అద్భుతాలను కూడా మనం చూస్తాము. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ AI ప్రారంభ దశలోనే కొంతమంది ఈ టెక్నాలజీ ని ఉపయోగించుకొని కొన్ని అరాచకాలకు పాల్పడుతున్నారు. ఉదాహరణకు AI వీడియో ఎడిటింగ్ ని తీసుకోవచ్చు. ఈ వీడియో ఎడిటింగ్ లో కేవలం మనకి ఇష్టమైన హీరోలు, క్రికెటర్లు, లేదా ఇతర సెలెబ్రెటీలకు సంబంధించిన ఫోటోలను ఉపయోగించి, ఒరిజినల్ వీడియో గా మార్చేయొచ్చు, వాయిస్ కూడా AI సహకారంతో మ్యానేజ్ చేయొచ్చు.
అలాంటి వీడియో ని ఒకటి చూసి సీనియర్ హీరో మాధవన్ కూడా భ్రమకి గురయ్యాడు. ఆ వీడియో నిజం అనుకొని తన ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్స్ లో షేర్ చేశాడు. దాని గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘టెక్నాలజీ మీద నాకు గొప్ప జ్ఞానం ఉంది. అలాంటి నన్నే ఏమార్చింది ఈ AI టెక్నాలజీ. నాకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ. అతన్ని పొగుడుతూ ఎవరైనా మాట్లాడితే నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఒకరోజు సోషల్ మీడియా లో రోనాల్డో విరాట్ కోహ్లీ గురించి, ఆయన నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడడం చూసి నేను ఎంతో ఆనందపడ్డాను. ఆ వీడియో ని గర్వంగా నేను సోషల్ మీడియా లో షేర్ చేశాను. ఈ వీడియో చూసిన వెంటనే విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ నాకు మెసేజ్ చేసింది’.
‘అది నిజమైన వీడియో కాదని, కొంతమంది ఫ్యాన్స్ అత్యుత్సాహంతో AI టెక్నాలజీ ని ఉపయోగించి చేసిన వీడియో అని చెప్పింది. ఆమె అలా చెప్పడంతో నేను షాక్ కి గురయ్యాను. చాలా ఇబ్బంది అనిపించింది. నా పరువు మొత్తం పోయింది అనే ఫీలింగ్ కలిగింది. టెక్నాలజీ మీద ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండే నేనే కనిపెట్టలేకపోయానంటే ఈ AI టెక్నాలజీ సైడ్ ఎఫెక్ట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీ ని ఇలాంటి వాటికి అభిమానులు ఉపయోగిస్తే పర్వాలేదు. ఎదో అభిమానం తో తమ డ్రీం ని ఇలా నెరవేర్చుకున్నారు అనుకుందాం. ఇదే ఒక ఆగంతకుడికి AI టెక్నాలజీ ని వాడుకునే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది?, అతను వీటిని ఉపయోగించి ఎన్ని దారుణాలు చేయొచ్చు?’ అంటూ మాధవన్ ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.