Maddock Films: తాజాగా బాలీవుడ్ లో స్టార్ హీరో వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తో సౌత్ ఇండియా బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. హీరో విజయ్ నటించిన తేరి సినిమాకు రీమేక్ గా బేబీ జాన్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అట్లీ. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను భారీ స్థాయిలో తీసి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే బేబీ జాన్ వంటి కమర్షియల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంటే రాజ్ కుమార్ హీరాణి లాంటి కల్ట్ ఫిలిం మేకర్స్ డుంకి లాంటి యావరేజ్ సినిమాలను బాక్స్ ఆఫీస్ దగ్గర డెలివరీ చేస్తున్నారు. ఇక షారుక్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించాయి. ఈ హిట్లు లేకపోతే బాలీవుడ్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని తెలుస్తుంది. సౌత్ ఇండియా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప2 ది రూల్ డబ్బింగ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సింహాసనాన్ని పొందినప్పుడు అక్కడివారికి నిజమైన షాక్ కలిగింది. దాంతో బాలీవుడ్ మీద టాలీవుడ్ ప్రభావం ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు. కానీ బాలీవుడ్ మేకర్ దీనినే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని తెలుస్తుంది. గత ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర హారర్ సినిమాలు స్త్రీ 2, ముంజ్యా సినిమాలు ఊహించని విజయం సాధించాయి. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన భూల్ భులయ్య 3 సినిమాకు ప్రతికూల ఫీడ్ బ్యాక్ వస్తున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 400 కోట్లు పైగా వసూళ్లు కాబట్టి విజయాన్ని సొంతం చేసుకుంది.
దాంతో బాక్సాఫీస్ దగ్గర ఎక్కువగా హారర్ సినిమాలు హిట్ అవుతున్న క్రమంలో మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ ఒకటి రెండు కాదు ఏకంగా 8 హారర్ సినిమాలను 4 ఏళ్లకు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. వీటిలో కొన్నిటి విడుదల తేదీలు కూడా ఖరారు చేయబడ్డాయి.
దీంతో రాబోయే కొన్ని సంవత్సరాలు దయ్యాలు, ఆత్మలు, పారానార్మల్ కథలతో ఉన్న సినిమాలే ఉంటాయని తెలుస్తుంది. ఈ హారర్ సినిమాలలో మొదటగా వస్తున్నది పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన నటిస్తున్న థమా. ఈ సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరికి శక్తి శాలిని సినిమా కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది 2026 లో హీరో వరుణ్ ధావన్ నటించిన భేదియా 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే 2027లో స్త్రీ 3, మహా ముంజ్యా సినిమాలు రిలీజ్ కానున్నట్లు సమాచారం.
ఈ సినిమాలకు సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక కొనసాగుతుంది. 2028 నాటికి పెహలా మహా యుద్ధ అరంగేట్రం చేస్తుంది ఆ తర్వాత రెండు నెలల్లో ధూస్రా మహాయుధ ప్రారంభం అవుతుంది. మడోక్ సినిమాటిక్ హారర్ యూనివర్సరీలోని అన్ని పాత్రలు ఈ చివరి చిత్రాలలో కనిపించనున్నాయి.