Mad Square OTT: ఈ ఏడాది యూత్ ఆడియన్స్ లో విడుదలకు ముందు నుండే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకొని, విడుదల తర్వాత అంచనాలకు మించి ఎంటర్టైన్మెంట్ ని అందించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square). 2023 వ సంవత్సరం లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్ గా నిల్చిన ‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్ ఇది. థియేటర్స్ లో కంటే ‘మ్యాడ్’ చిత్రానికి ఓటీటీ లోనే సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఒక కల్ట్ క్లాసిక్ వేల్యూ ని తెచ్చుకుంది ఈ చితం. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ ని అద్భుతంగా ఎంటర్టైన్ చేసింది, కానీ సెకండ్ హాఫ్ లో కాస్త ఆ జోరు తగ్గడంతో లాంగ్ రన్ ఆశించిన స్థాయిలో రాలేదు. కచ్చితంగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న చిత్రమిది. కానీ కేవలం 70 కోట్లతో సరిపెట్టాల్సి వచ్చింది.
Also Read: రామ్ తో నిశ్చితార్థం పై స్పందించిన భాగ్యశ్రీ భోర్సే..లేటెస్ట్ పోస్ట్ వైరల్!
అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ లో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని భారీ రేట్ కి నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థ కొనుగోలు చేసింది. తెలుగు తో పాటు తమిళం. హిందీ మరియు ఇతర బాషల రైట్స్ ని కూడా సొంతం చేసుకుంది నెట్ ఫ్లిక్స్ సంస్థ. కాసేపటి క్రితమే ఈ చిత్రాన్ని ఈ నెల 25 నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. థియేటర్స్ లో భారీ లాభాలను తెచ్చి పెట్టిన ఈ సినిమా, ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో చూడాలి. ఈ సినిమా థియేటర్స్ లో నడుస్తున్నప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ‘మ్యాడ్’ చిత్రం ట్రెండింగ్ లోకి వచ్చింది. అది కూడా మామూలు రేంజ్ లో కాదు, 9 వారాల నుండి నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతున్న ‘పుష్ప 2’ చిత్రాన్ని వెనక్కి నెట్టి మరీ ట్రెండ్ అయ్యింది.
దీనిని బట్టీ ఈ సినిమా కోసం నెటిజెన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యాక ఈ చిత్రం రికార్డ్స్ ని నెలకొల్పిన ఆశ్చర్య పోనక్కర్లేదు. ఈ సినిమాని నిర్మించిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ నుండి గత ఏడాది విడుదలైన ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఏకంగా 15 వారాలు ట్రెండ్ అయ్యింది. అదే సంస్థ నుండి విడుదలైన ‘డాకు మహారాజ్’ చిత్రానికి కూడా నెట్ ఫ్లిక్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ నుండి వస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందా లేదా అందేది చూడాలి. 24 వ తేదీ అర్థ రాత్రి 12 గంటల నుండి ఈ సినిమా అందుబాటులోకి రానుంది.