Mad Square : యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్ లో చూపించినట్టుగానే ఈ సినిమాలో కామెడీ అద్భుతంగా క్లిక్ అయ్యింది. దాదాపుగా ప్రతీ జోక్ కూడా పేలింది. ప్రతీ చిన్న విషయాన్నీ భూతద్దంలో చూసి విమర్శించే వాళ్ళు కూడా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారంటే, ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు కూడా అదిరిపోయాయి. నిర్మాత నాగవంశీ(Naga Vamsi) నిన్నటి ప్రెస్ మీట్ లో కొన్ని చోట్ల ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి మొదటి రోజు ‘మ్యాడ్’ క్లోజింగ్ కలెక్షన్స్ కంటే ఎక్కువ వచ్చాయని చెప్పుకొచ్చాడు.
Also Read : మొదటి రోజే ‘గుంటూరు కారం’ ని దాటేసిన ‘మ్యాడ్ స్క్వేర్’..!
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కేవలం నైజాం ప్రాంతం నుండే రెండు కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారమైన విషయం కాదు. ‘మ్యాడ్’ చిత్రానికి క్లోజింగ్ లో కేవలం నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ‘మ్యాడ్ స్క్వేర్’ ఆ వసూళ్లను కేవలం రెండవ రోజే దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకు మొదటి రోజు 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఇక ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో అయితే ఈ సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. కేవలం ప్రీమియర్ షోస్ నుండే దాదాపుగా నాలుగు లక్షల డాలర్లను రాబట్టిన ఈ సినిమాకు ప్రీమియర్స్+ మొదటి రోజుకు కలిపి 6 లక్షలకు పైగా డాలర్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు.
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి మొదటి రోజు 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 16 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కనీసం మీడియం రేంజ్ హీరోల క్యాటగిరీ లో కూడా లేని వీళ్లకు ఈ స్థాయి ఓపెనింగ్ వసూళ్లు రావడం అనేది చిన్న విషయం కాదు. ఊపు చూస్తుంటే ఈ చిత్రం కచ్చితంగా ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే కనుక జరిగితే అద్భుతం అనే చెప్పాలి. రేపు, ఎల్లుండి థియేటర్స్ వద్ద ఓవర్ ఫ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉగాది, రంజాన్ దినాలు కాబట్టి మొదటి రోజు కంటే రేపు, ఎల్లుండి వచ్చే వసూళ్లు ఎక్కువ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ రెండు రోజులు అయ్యాక, మళ్ళీ శ్రీ రామ నవమి లాంటి పండుగ దినం ఉంది. ఆరోజు కూడా భారీ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read : గంటకు 10 వేల టిక్కెట్లు..’మ్యాడ్ స్క్వేర్’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్!