Mad Square : యూత్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. టీజర్, ట్రైలర్, పాటలతో ఈ చిత్రం విడుదలకు ముందే అద్భుతమైన బజ్ ని ఏర్పాటు చేసుకుంది. ఈ మాత్రం కామెడీ ఉంటే చాలు, ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తారని అందరూ అనుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉండడంతో ఓపెనింగ్స్ కళ్ళు చెదిరే రేంజ్ లో నమోదు అవుతున్నాయి. ఉదయం ఆట నుండే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ థియేటర్ లో హౌస్ ఫుల్స్ బోర్డ్స్ పడుతున్నాయి. బుక్ మై షో యాప్ లో అయితే ఈ సినిమాకు గంటకు 10 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఒక చిన్న సినిమాకు ఈ రేంజ్ ట్రెండ్ అంటే చిన్న విషయం కాదు.
Also Read : ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ ట్విట్టర్ టాక్..సెకండ్ హాఫ్ తేడా కొట్టేసింది!
నిన్న విడుదలైన మోహన్ లాల్(Mohanlal) ‘L2 :ఎంపురాన్'(L2: Empuran) చిత్రాన్ని సైతం ‘మ్యాడ్ స్క్వేర్’ ఇప్పుడు డామినేట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. మలయాళం ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా, మన టాలీవుడ్ మీడియం రేంజ్ హీరో సినిమా కంటే తక్కువనా? అని సోషల్ మీడియా లో ట్రోల్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తుంటే ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వస్తాయని, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటుకుంటున్నారు. రంజాన్ లోపు ఈ చిత్రం కచ్చితంగా 40 కోట్ల రూపాయిల షేర్ మార్క్ ని అందుకుంటుందని, మొదటి వారం లోనే 100 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
లాంగ్ రన్ లో కాస్త డీసెంట్ స్థాయి రన్ ని హోల్డ్ చేసుకోగలిగితే ఈ చిత్రానికి కచ్చితంగా 150 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ చిత్రం లో హీరోలుగా నటించిన ముగ్గురి పేర్లు కూడా జనాలకు సరిగా తెలిసి ఉండదు, అయినప్పటికీ ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందంటే మన ఆడియన్స్ మంచి సినిమాలను ఏ రేంజ్ లో ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తమిళ సినిమా ఇండస్ట్రీ కి ఈ ఏడాది ‘డ్రాగన్’ చిత్రం ఎలాంటి సర్ప్రైజ్ హిట్ గా నిల్చిందో, మన టాలీవుడ్ కి ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం అలా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిర్మాత నాగవంశీ కి మహర్దశ నడుస్తుంది. ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమాలన్నీ జాక్పాట్ కొడుతున్నాయి. ఈ సినిమాతో మరో జాక్పాట్ ని ఆయన తన ఖాతాలో వేసుకున్నట్టే.
Also Read : ఆంధ్ర ప్రదేశ్ లో ‘మ్యాడ్ స్క్వేర్’ టికెట్ రేట్స్ ఈ రేంజ్ లో ఉన్నాయేంటి!