https://oktelugu.com/

Narne Nitin: మ్యాడ్’ మూవీ హీరో కాబోయే భార్య కి విక్టరీ వెంకటేష్ ఉన్న రిలేషన్ అదేనా..? ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు!

Mad' movie hero Narne Nithin's fiancee Victory Venkatesh's relationship?

Written By:
  • Vicky
  • , Updated On : November 4, 2024 / 04:12 PM IST

    Mad Movie Hero Narne Nitin

    Follow us on

    Narne Nitin:  జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణీత సోదరుడు నార్నే నితిన్ నిన్న హైదరాబాద్ లోని తన నివాసం లో శివాని అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఈ నిశ్చితార్ధ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో పాటు, విక్టరీ వెంకటేష్ కూడా తన కుటుంబ సభ్యులతో హాజరయ్యాడు. పెళ్లి కూతురు కి వెంకటేష్ కుటుంబం తో చాలా దగ్గర బంధుత్వం ఉందని, అందుకే వెంకటేష్ ఈ నిశ్చితార్ధ వేడుకకు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచాడని మీడియా లో మనమంతా చూసే ఉంటాము. శివాని నెల్లూరు జిల్లాకు చెందిన అమ్మాయి. ఈమె తండ్రి తాళ్లూరి వెంకట కృష్ణ ప్రసాద్ వెంకటేష్ కుటుంబానికి బావ వరుస అవుతాడు. వెంకటేష్ తో అనేక వ్యాపార సంబంధాలు కూడా వెంకట కృష్ణ కి ఉన్నాయి. వెంకటేష్ ఇద్దరు కూతుర్ల పెళ్లిళ్లకు కూడా తాళ్లూరి వెంకట కృష్ణ తన కుటుంబం తో కలిసి హాజరవ్వడమే కాకుండా, పెళ్లి పనులు కూడా దగ్గరుండి పర్యవేక్షించాడు. వీళ్లిద్దరి మధ్య అంతటి సాన్నిహిత్యం ఉంది.

    గత నాలుగేళ్ల నుండి నార్నే నితిన్, శివాని ప్రేమించుకుంటున్నారు. వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం గురించి ఇంట్లో తెలిసేలా చేసి పెళ్లి కుదిరించడంలో కూడా వెంకటేష్ పాత్ర ఉందట. ఇక ఈ నిశ్చితార్థం విశేషాలకు వస్తే నార్నే నితిన్ తండ్రి నార్నే శ్రీనివాస రావు రాజకీయ నాయకుడు అవ్వడంతో, ప్రముఖ రాజకీయ నాయకులందరూ ఈ నిశ్చితార్ధ వేడుకకు హాజరైనట్టు తెలుస్తుంది. ఇక సినీ ఇండస్ట్రీ నుండి మాత్రం నితిన్ కి బాగా దగ్గరైన ఒకరిద్దరు యంగ్ హీరోలు తప్ప ఎవ్వరూ హాజరు కాలేదట. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తప్ప నందమూరి కుటుంబానికి సంబంధించి ఎవ్వరూ కూడా హాజరు కాలేదట. రీసెంట్ గానే నారా రోహిత్ నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తప్ప నందమూరి కుటుంబం మొత్తం హాజరైంది. చూస్తుంటే సొంత కుటుంబంలోనే అంతర్గత పోరు నడుస్తుందని కొంతకాలం నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలు నిజమేనని అనిపిస్తుంది.

    ఇక నార్నే నితిన్ విషయానికి వస్తే ఈయన ‘మ్యాడ్’ సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత విడుదలైన ‘ఆయ్’ కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ‘మ్యాడ్ 2 ‘, ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ వంటి చిత్రాలు చేస్తున్నాడు. వీటిల్లో ‘మ్యాడ్ 2 ‘ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.